EPAPER
Kirrak Couples Episode 1

Sitaram’s family : సీతారామ కుటుంబం కొలువైన వాయల్పాడు

Sitaram’s family : సీతారామ కుటుంబం కొలువైన వాయల్పాడు


Sitaram’s family : దేశంలో రాముడు లేని గుడి ఉండదంటే ఆశ్చర్యం లేదు. సీతారాములు కొలువైన ఎన్నో క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మనకు తెలిసిన భద్రాచలం, ఒంటిమిట్టే కాదు ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. అలాంటి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి వాయల్పాడు. సీతారాములు కుటుంబ సమేతంగా కొలువైన పట్టాభిరామాలయం ఇక్కడ మనం దర్శించవచ్చు. సాధారణంగా రాములు వారి గుడిలో
రాముడి, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ సమేత విగ్రహ సమేతంగా కొలువై దర్శనమిస్తుంటారు. కానీ చిత్తూరు జిల్లాలోని వాయల్పాడులో భరత శత్రుఘ్నులు కూడా ఉంటారు. ఇలాంటివి దేశంలో అతి కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో వాయల్పాడు ఒకటి.


వాయల్పాడులో రాముల వారిని జాంబవంతుడే స్వయంగా ప్రతిష్టించి పూజించాలని ఆలయ చరిత్ర చెబుతోంది. అలాంటి విగ్రహాలు పుట్టలో నుంచి బయటపడ్డాయట.. వల్మీకము నుండి వెలుగు చూడటం వల్ల ఈ ఊరికి వాల్మీకి పురం అనే పేరు కూడా ఉంది. స్థానికంగా ఉండే కొండపై వాల్మీకి మహర్షి తపస్సు చేయడం వల్ల వాల్మీకీ పురం అనే పేరు వచ్చిందనీ, అదే కాల క్రమేణా వాయల్పాడు అయిందిన్న మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.

రామాలయాలలో స్వామివారికి ఎడమవైపున అమ్మవారు ఉంటారు. ఈ క్షేత్రంలో స్వామివారికి కుడివైపున సీతాదేవి ఉండటం విశేషం. శ్రీరామ నవమి సమయంలో ఈ క్షేత్రానికి రావాలంటే అతి సులువుకాదు. 9 రోజుల నవరాత్రి ఉత్సవాలుకి ,అ అమ్మవారి నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున కల్యాణోత్సవాన్ని చూసేందుకు విశేష సంఖ్యలో భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. నవమి వేళ జరిగే పూజలు .. సేవలు చూసేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఇక్కడ గర్భాలయ గోపురాన్ని సుదర్శన విమానం అంటారు. స్వామివారు ఖడ్గాలను కూడా ధరించి దర్శనం ఇవ్వడం వల్ల ప్రతాప రామచంద్రుడు అని పిలుచుకుంటారు. చోళులు .. విజయనగర ప్రభువుల కాలంలో ఈ క్షేత్రం పేరు మార్మోగింది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని .. వైభవాన్ని తాళ్లపాక అన్నమయ్య కీర్తించడం విశేషం.

Tags

Related News

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Big Stories

×