EPAPER

Simhadri Appannaswamy : అప్పన్నస్వామికి శాపం వల్లే అలా జరిగిందా

Simhadri Appannaswamy : అప్పన్నస్వామికి శాపం వల్లే అలా జరిగిందా
Simhadri Appannaswamy

Simhadri Appannaswamy : విశాఖపట్నం సమీపంలో తూర్పుకనుమల్లోని సింహగిరిపై ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామని తెలుగు ప్రజలు ప్రేమగా స్వామిని సింహాద్రి అప్పన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో స్వామి నిజరూప దర్శనం సంవత్సరం ఒకే ఒక్క రోజు. అది కూడా 12 గంటలు మాత్రమే.తన గానంతో స్వామి ని పిలిచి తన సంకీర్తనతో స్వామిని మెప్పించి నాట్యమడించిన ప్రియ భక్తుడు కృష్ణామాచార్యులు. దేవా అని సంభోధనతో తన సంకీర్తనను ప్రారంభించి 4లక్షల 32వేల సంకీర్తనలు రచించి స్వామి కి అంకితమిచ్చిన అపర భాగవోత్తముడు. పుట్టు గుడ్డిగా సింహాచల గ్రామానికి 20కి.మీ దూరంలో ఉన్న సంతూరు గ్రామంలో పుట్టిన కృష్ణమయ్యను చిన్నప్పుడే భావిలో వదిలేశారు కన్నవారు.


స్వామి దయతో అంధత్వం పోవడంతో తన జీవితాన్ని స్వామికే అంకితమిచ్చారు కృష్ణమయ్య.11వ శతాబ్దం లో సంకీర్తనలు పాడుతున్న కృష్ణమయ్య వద్దకు బాలుడుగా వచ్చి ఆడిపాడి ఆనందింప జేశాడు అప్పన్న స్వామి. కృష్ణమయ్య సంకీర్తన యఙ్ఞం జరుగుతుండగానే సింహాచల క్షేత్రానికి ఆదిశేషు అవతారం భగవద్రామానుజులు వచ్చారు. ఇటు రామానుజుల వారికి అటు కృష్ణమయ్యకు ఇద్దరికీ ఒక్కో రూపంలో కనిపించి కటాక్షించాడు సింహాద్రినాథుడు. కానీ తన సంగీతానికి , సంకీర్తనకు అప్పన్న దాసుడు అని భావించిన కృష్ణమయ్యకు గర్వం పెరిగింది. ఆ గర్వంతో భగవద్రమానుజుల వారి పట్ల నిర్లక్ష్యాన్ని చూపించి తప్పు చేశాడు. తనను పట్టించుకోకపోతే సహిస్తాడు కానీ తన భక్తులకు నిర్లక్ష్యం జరిగితే సహించలేడు సింహాది అప్పడు.

మోక్షం గురించి రామానుజుల వారు అడిగిన ప్రశ్నతో కళ్లు తెరుచుకుంటాయి.ఆ సమయంలో తొందర పాటు లో నోరు జారి నీ “ఆలయం అగ్ని కి ఆహుతి అవుతుందని శపిస్తారు. తనకే శాపమిచ్చిన కృష్ణమయ్యకు స్వామి ఏ వచన సంకీర్తన తో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించావో అవే వచనసంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతీ మరుగున పడిపోతుందని ప్రతిశాపమిచ్చి అంతర్థానమవుతారు. ఆ తర్వాత మనో నేత్రంలో మహావిష్ణు రూపంలో రామానుజులు వారు కనపడే సరికి వెళ్ళి శరణు వేడారు కృష్ణమాచార్యులు వారు.నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని కొంతకాలం తరువాత తిరీగీ వెలుగోలోనికి వస్తాయని అభమిచ్చారు అప్పన్న స్వామి..కొన్ని వందల సంవత్సరాల తరువాత కృష్ణమయ్య మాటలు నిజమయ్యాయి.


Tags

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×