Big Stories

Significance of marriage : వారంలో ఆ రోజు పెళ్లిళ్లు చేయకూడదా…?

Significance of marriage

- Advertisement -

Significance of marriage : రెండు జీవితాలను ముడివేసేది పెళ్లి. మూడు మూళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒకటయ్యే ముహూర్తం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పురోహితుల నిర్ణయించి మూహూర్తం వెనుక జాతకాలు, నక్షత్రాలు, తిథులు, వారాలు ఇలా ఎన్నో ఎన్నింటిని పరిశీలన చేస్తారు. ఆ తర్వాత పెళ్లి ఘడియలను శుభలేకపై రాస్తారు. అయితే వారంలో కొన్ని రోజులు పెళ్లిలకు పనిచేయవని అంటారు. ముఖ్యంగా సోమవారం నాడు నూతన వధువరుల కళ్యాణం చేయకూడదని పెద్దలు సూచన. అలాగే ఆంజయనేయుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం కూడా పెళ్లిళ్లు ఉండవు. శనివారం రోజు పెళ్లి ముహూర్తాలకు మధ్యస్థమైన రోజుగా భావిస్తారు.

- Advertisement -

పెళ్లి ముహూర్తాలు పెట్టేటప్పుడు 21 దోషాలు కలుగుతుంటాయి. అలాంటి వాటిలో ఐదు దోషాలు అస్సలు లేకుండా చూసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉత్తమ మైన వార, తిథుల, నక్షత్రాల కలయికను పెట్టి లగ్గం పెట్టుకోవాలి. అలాగే బుధవారం, గురువారం, శుక్రవారం, పెళ్లిళ్లకి శ్రేష్టమైన వారాలు. ఆదివారం కూడా పెళ్లి ముహూర్తాలకు మధ్యస్థంగా లెక్కపెడుతుంటారు. సోమవారం రోజు పెళ్లిళ్లు జరిగితే వరుడు భవిష్యత్తులో మరో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రం తెలిసిన పెద్దలు చెబుతున్నారు. అందుకే ఇవన్నీ చెప్పకుండా సోమవారం నాడు పెళ్లిళ్లు వద్దని పెద్దలు అంటూ ఉంటారు.

కాకపోతే ఇలాంటి ఆచారాలు అందరూ అన్నీ చోట్ల పాటించారు. కొన్ని చోట్ల ఈ నియమావళి ప్రకారమే లఘ్నాలు రాయించుకుంటారు. కోస్తా తీర ప్రాంతంలో సోమవారం కూడా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. పెళ్లికొడుక్కి ఉత్తమ గుణాలు ఉన్న భార్య రావడం మంచిదే కదా అన్న ఆలోచనతో ఆ రోజు పెళ్లిపీటలు ఎక్కిస్తుంటారు. మంగళవారం మాత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లోను పెళ్లిళ్లకి దూరంగా ఉంటారు. శనివారం కూడా పెళ్లి చేయచ్చు కానీ అది మధ్యమంగానే భావిస్తారు. ఉత్తమమైన రోజులు మాత్రం పెళ్లిళ్లకి బుధ, గురు, శుక్రవారాలే. అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డప్పుడు పంతులు గారు కాదంటే వింటారా… ఈనియమాలన్నీ పట్టించుకున్న వాళ్లకే. నేటి రోజుల్లో అన్ని వేళ్లల్లో సమయాల్లో అన్ని రోజుల్లో పెళ్లిళ్లు చేసేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News