BigTV English

Feet Facing : డోర్ వైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదా…?

Feet Facing : డోర్ వైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదా…?


Feet Facing

Feet Facing : ప్రతీ మనిషి ఆకలి, నిద్ర అవసరమైనవి. నిత్యం అనేక ఒత్తిళ్లు, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారికి, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారికి, ఆ మాట కొస్తే ప్ర‌తి మ‌నిషికి నిద్ర అవ‌స‌ర‌మే. నిద్ర పోవ‌డం వ‌ల్ల మ‌న శరీరం రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది. మ‌ళ్లీ లేచే స‌రికి ఉత్తేజం, ఉత్సాహం తొణికిసలాడుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా ప‌నిచేయ‌వ‌చ్చు. మన ఆరోగ్యం నిద్రతోనే ముడిపడి ఉంటుంది. మన అవయవాలు సరిగా పనిచేయాలంటే నిద్ర తప్పనిసరి. ఇదే కాదు, నిద్ర‌తో మ‌న‌కు ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. సాధార‌ణంగా ఎవ‌రైనా నిద్ర పోయే స‌మ‌యంలో గ‌దిలో ఏదో ఒక వైపు త‌ల‌ను పెట్టి నిద్రిస్తారు. ఎటు వైపు కాళ్లు పెట్టి నిద్రించాలి. ఏ దిక్కు కాళ్లు చాపుకోవాలనే దానిపై వాస్తు నిపుణులు సూచనలు చేస్తున్నారు.

ఫ‌లానా దిక్కు మంచిద‌ని, ఇంకో దిక్కు మంచిది కాద‌ని చెబుతుంటారు. అయితే త‌ల కాకుండా నిద్రించే స‌మ‌యంలో కాళ్ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ట‌. అంటే కాళ్ల‌ను తలుపులు ఉన్న‌వైపు కాకుండా వేరే ఏ వైపుకైనా పెట్టి నిద్రించాల‌ట‌.చైనా వాస్తు ఫెంగ్ షుయ్ సూత్రాల ప్రకారం, మంచాన్ని తలుపుకు ఆనించి ఉంచడం అత్యంత చెత్త స్థానం. ఫెంగ్ షుయ్‌ని నమ్మే వారు దీనిని ‘చనిపోయిన వ్యక్తి స్థానం’ లేదా ‘శవపేటిక స్థానం’ అని పిలుస్తారు. పడుకునేటప్పుడు తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి చదువుకోవడం,సాధన చేయడం మంచిది .


త‌లుపులు ఉన్న వైపు కాళ్ల‌ను పెట్టి నిద్రించడం వ‌ల్ల మ‌న ఒంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుందట‌. దీంతో ఆ రోజంతా మ‌న‌కు విశ్రాంతి ఉండ‌ద‌ట‌. తీవ్ర‌మైన అసంతృప్తి, ఒత్తిడి, ఆందోళ‌న క‌లుగుతాయ‌ట‌. అంతేకాదు చ‌నిపోయిన వారి మృతదేహాల‌ను గ‌ది నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్లేట‌ప్పుడు ముందుగా కాళ్ల‌ను బ‌య‌ట ఉంచుతారు క‌దా, అందుకే ఆ వైపే మ‌నం కూడా కాళ్ల‌ను పెట్టి నిద్రిస్తే దెయ్యాల‌ను ఆహ్వానించిన‌ట్టు అవుతుంద‌ట‌. ఇది అస్స‌లు మంచిది కాద‌ట‌. కాబ‌ట్టి తలుపులు ఉన్న‌ వైపు కాళ్ల‌ను పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌. వేరే ఏ దిక్కుకైనా కాళ్ల‌ను పెట్టి నిద్రిస్తే మంచిది. దీంతో ఎలాంటి అశుభాలు జ‌ర‌గ‌కుండా ఉంటాయి.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×