EPAPER
Kirrak Couples Episode 1

God Photos : పడుకునే గదిలో దేవుడి పటాలు పెట్టుకోకూడదా.?

God Photos : పడుకునే గదిలో దేవుడి పటాలు పెట్టుకోకూడదా.?

God Photos : పడుకునే ముందు, పడుకుని లేచిన తర్వాత భగవంతుడ్ని తలుచుకోవడం, పూజించడం ఆచారం. ఇంట్లో నిరభ్యంతరంగా దేవుడి పటాలు, కేలండర్లు పెట్టుకోవచ్చు. ధర్మబద్ధంగా పడగ గదిలో ఎలాంటి దేవత, దేవుళ్ల పటాలను పెట్టుకోరాదు. కొంతమంది అలంకారం కోసం రాధా, కృష్ణుల పటాలను పెట్టుకుంటారు. అందులో ఎలాంటి తప్పులేదని పండితులు చెబుతున్నారు. అలాగే దేవుడి విగ్రహాలను కూడా పెట్టుకోకపోవడం మంచిది.


అయితే నిత్యం పూజించే దైవ పీఠం పడక గదిలో ఏర్పాటు చేసుకోకూడదు . మహానగరాల్లోను, పేదరికం వల్ల కేవలం ఒకే గదిలో కాపురం చేసే వాళ్లకు తప్పదు కాబట్టి ఒక మూలలో దేవుడి పటాలు పెట్టుకోవచ్చు. దేవుడి పీఠం పెట్టుకోవచ్చు. దేవుడి ఎత్తైన స్థలంలో ఉంచుకోవాలి.వీలేతే అలమరాలో దేవుడి పటాలు ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఒక తెరలాంటి వేలాడదీసి దేవుడ్ని ఆరాధించడంలో ఎలాంటి తప్పులేదు. అలాగే శ్రీరాముడి దర్బార్ చిత్ర పటాన్ని ఏ గదిలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఒక వేళ దేవుడి పటాలను గోడకు వ్రేలాడదీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు తగిలించాలి. ఒకవేళ అవకాశం ఉంటే దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే, ఈశాన్యం గదిని అందుకు వాడుకోవటం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగాని మందిరం మాదిరి కట్టడంగాని నిర్మించుకూడదు. దేవుడి పటాలను ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్త్రం వేసి పటాలు, ప్రతిమలు పెట్టుకుని పూజించు కోవచ్చు.


Tags

Related News

Arunachalam food: అరుణాచలం వెళ్తున్నారా? అయితే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Lucky Zodiac Signs: 2 గ్రహాల ప్రభావం.. వీరికి ధనలాభం

Horoscope 24 September 2024: నేటి రాశి పలాలు.. ఊహించని ధనలాభం! అవివాహితులకు వివాహం నిశ్చయం!

Negative Energy Signs: ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. ఈ నివారణ చర్యలు పాటించండి

Shardiya Navratri 2024 : నవరాత్రులులోపు ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచకండి

Shani Margi 2024: అక్టోబర్‌లో శని గ్రహం వల్ల 3 రాశుల్లో పెద్ద మార్పు

Toilet Vastu Tips: కొత్త ఇళ్లు కడుతున్నారా.. టాయిలెట్ ఈ దిశలో ఉంటే కెరీర్‌లో పురోగతి ఉండదు..

Big Stories

×