EPAPER

Rent House : అద్దె ఇంట్లో పాలు పొంగించకూడదా….

Rent House :  అద్దె ఇంట్లో పాలు పొంగించకూడదా….


Rent House : కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు పాలు పొంగించడం హిందూసంప్రదాయాల్లో వస్తున్న ఆచారం. ముఖ్యంగా నూతన గృహ ప్రవేశం చేసేటప్పుడు ఇంటి పడుచుతో పాలు పొంగించే సంప్రదాయం పెద్దల కాలం నాటి నుంచి వస్తోంది. మరి అద్దె ఇంట్లోకి వెళ్లినప్పుడు కూడా కొంతమంది పాలు పొంగిస్తూ ఉంటారు. ముహూర్తం చూసి మరీ పాలు పొంగిస్తూ ఉంటారు. సొంతింట్లో కాకుండా అద్దె ఇల్లు మారినపుడల్లా పాలు పొంగిస్తే వారికి సొంతింటి కల నెరవేరదని పండితులు చెబుతున్నారు. స్వగృహంలో చేయాల్సి పని వసతి గృహంలో చేయడం వల్ల కల కలగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కారణం అందరికి అన్ని ద్వారాలు పడకపోవచ్చు. అలాంటి సమయంలో పాలు పొంగించడం వల్ల కలిగే పాజిటివ్ ఎనర్జీ ఇంటి ఓనర్ కు వెళ్తే…నెగటివ్ అంతా ఇంట్లో అద్దెకున్న వారికి కలుగుతుంది.

అద్దె ఇల్లు మారినప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. ఆ ఇల్లు పాజిటివా..నెగటివ్ ఫలాతాన్ని ఇస్తుందా అనేది మూడు నెలలోపలే తెలిసిపోతుంది. అది ఏమైనా ఇబ్బంది పెడుతున్నా నెగిటవ్ ఉన్నా గుర్తించ లేకపోతే మూడు నెలల దాటాక కూడా ఆ ఇల్లు మనం ఖాళీ చేయనివ్వదు. అద్దె ఇంటికి ముహూర్తాలు చూడాల్సిన పనిలేదని కూడా కొందరు పండితులు చెబుతున్నారు. ఇల్లు ఉన్న దిక్కు మనకు సెట్ అవుతుందా లేదా అన్న సంగతి చూసుకుంటే సరిపోతుందంటున్నారు.


స్వగృహం నుంచి స్వగృహానికి మారినప్పుడు మాత్రమే ముహూర్తం చేసుకోవాలని సూచిస్తున్నారు.
వసతి గృహానికి వారాలు, మాసాలు , తిథులతో సంబంధం లేదని సెలవిస్తున్నారు. సొంతింటిల్లో దీపారాధన చేసిన నిద్ర చేస్తారు. అద్దె ఇంట్లో నిద్ర చేసి దీపారాధన చేస్తారు ఇదే రెండింటింకి ఉన్న తేడా. అలా చేయడం వల్ల మనకు వృద్ధి చూపిస్తుంది. సొంతింట్లో ఉండి దీపారాధన చేసినదానికి అద్దె ఇంట్లో ఉండి నిద్ర చేసి దీపారాధనకి తేడా కనిపిస్తుంది. ఏ మనస్సుతో దీపాన్ని వెలిగిస్తామో అలాగే అది నడిపిస్తుంది. అద్దె ఇల్లు వాస్తు ప్రభావం కచ్చితంగా అందులో ఉండే వారిపై పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×