Big Stories

Diwali Deepalu : దీపావళికి మట్టి దీపాలే వాడాలా!

Diwali Deepalu

Diwali Deepalu : భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం. అందుకే ఈ పేరు వచ్చింది. దీపాలను సంపద, ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. అందువల్లే దీపావళి రోజున దీపాలను వెలిగించి సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తితో పూజించి ఇంటికి ఆహ్వానిస్తారు.

- Advertisement -

ఈ పండుగ రోజు అంతా ఖచ్చితంగా దీపాలని అందరూ వెలిగిస్తూ ఉంటారు కాని దీపావళి నాడు దీపాలని పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం మరిచిపోకూడదు. దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మ వారి ఆశీస్సులు పొందాలన్నా ఆర్థికంగా శ్రేయస్సు పొందాలన్నా దీపాలను వరుసలో అందంగా అలంకరించడం చాలా కీలకం. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయని ఎప్పటి నుంచి విశ్వాసం ఉంది. పూజగదిలో వెలిగించే మట్టి ప్రమిదను ఒకసారి వాడిన తర్వాత మళ్లీ వాడరాదు. ఆరుబయట లేదా ఇంటి గుమ్మం ముందు మాత్రం వాడుకోవచ్చు.

- Advertisement -

దీపాలను అలంకరించడానికి కచ్చితంగా మట్టి దీపాలను ఉపయోగించడం శ్రేయస్కరం. మట్టి దీపాలతో ఇంటిని అలంకరించడం చాలా మంచిదని మన పెద్దలు చెప్పారు. ఇది ఆర్థిక పురోగతిని కలిగిస్తుంది. అలాగే దీపావళి నాడు దీపాలు పెట్టేటప్పుడు ఇంటి ఉత్తరం వైపు కచ్చితంగా మట్టి దీపం పెడితే ఐశ్వర్యాన్ని, ధన ప్రాప్తిని కలిగిస్తుంది. ఉత్తరం వైపు దీపం పెడితే చక్కటి ఫలితాలు వస్తాయి.లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించండి అలానే తులసి కోట ముందు ఒక దీపాన్ని పెట్టండి. ఇవి కూడా చాలా మంచి చేస్తాయి.

చాలామంది గుండ్రంగా ఉండే దీపాలను మాత్రమే వెలిగించాలని అంటారు కానీ పొడుగ్గా ఉండే దీపాలను వెలిగించవచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. పండుగ రోజు మనం పెట్టే దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటి లోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు.వెలుగుల్లో తారాజువ్వల మోతలతో సందడిగా మారే ఈ పండుగ అశ్వయుజ మాసంలో వస్తుంది. మొత్తం మూడు రోజుల పాటూ జరుపుకునే పండుగ దీపావళి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News