లక్ష్మీదేవి మనకు సంపదను అందిస్తే గణేషుడు జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాడు. అందుకే ఈ ఇద్దరినీ కలిపి పూజ చేయడం దీపావళి నాడు ఆచారంంగా మారింది. సంపద, సమృద్ధి అందించే దేవతలు వీరిద్దరూ. అయితే కొంతమంది లక్ష్మీ పూజలో గణేశుడిని, లక్ష్మీదేవికి ఎడమవైపున ఉంచుతారు. నిజానికి అలా ఉంచడం సరికాదు.
కుడివైపున ఉంచాలా?
ఒక దేవతకు ఎడమవైపున స్త్రీ శక్తి మాత్రమే ఉండాలి. అంటే ఆ దేవత భార్య అతనికి ఎడమవైపున ఉండాలి. కాబట్టి గణేశుడికి ఎడమవైపున లక్ష్మీదేవిని ఉంచకూడదు. ఆమెను గణేశుడికి కుడివైపునే ఉంచాలి.
దీపావళి రోజు ప్రతి హిందూ కుటుంబం లక్ష్మీ, గణేశుడు ఇద్దరికీ కలిపి పూజ చేస్తారు. ఆ రోజు శుభ్రమైన దుస్తులను ధరించి ఇంటి ఆలయాన్ని పువ్వులతో అలంకరించండి. పూజ చేసే స్థానంలో శుభ్రమైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై లక్ష్మీ గణేష్ విగ్రహాలను ఉంచండి. వారి ముందు అగరబత్తిని వెలిగించండి. ఆవాల నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలాగే దేవతలకు పండ్లు, పువ్వులు, నాణాలు సమర్పించాలి. ముందుగా గణేశుడిను ఉద్దేశించి పూజ ప్రారంభించాలి. ఈ పూజ ప్రారంభించినా కూడా మొదట వినాయకుడినే పూజించడం పాటించాలి. ‘ఓం గం గణపతయే నమః’ అనే గణేశ మంత్రాన్ని జపించండి. ఆ తర్వాతే లక్ష్మీ పూజను ప్రారంభించండి.
కొన్ని నమ్మకాలు, సాంప్రదాయాల ప్రకారం దేవుడి కుడివైపు గౌరవం ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇది సమానమైన స్థానాన్ని భావిస్తారు. అందుకే ఇద్దరు దేవతలను పక్కపక్కన పెట్టేటప్పుడు.. వారిద్దరూ జంట కాకపోతే చాలా జాగ్రత్తగా వారి విగ్రహాలను పెట్టాలి.
లక్ష్మీదేవి గణేశుడుని కలిసి పూజించడం వల్ల సంపదకు మించిన దీవెనలు తమకు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ పూజ ప్రజలకు ఆర్థిక సమృద్ధి, సంపద, ధనవంతులను చేస్తే గణేశుడు జ్ఞానాన్ని ఇస్తాడు. విజయానికి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టే వీరిద్దరూ మీ జీవితంలో ప్రధానమైన వారు.
దీపావళినాడు లక్ష్మీపూజ ఎప్పుడు చేయాలో తెలుసుకోండి. అక్టోబర్ 31న మధ్యాహ్నం 3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. అలాగే నవంబర్ 1 సాయంత్ర ఆరు గంటలకు వరకు ఆ తిధి ఉంటుంది. లక్ష్మీపూజను అక్టోబర్ 31న సాయంత్ర 6.27 గంటల నుంచి రాత్రి 8.32 గంటల వరకు చేయవచ్చు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. ఇంటి ముందు రంగోలీతో లక్ష్మీదేవిని ఆహ్వానం పలికి మీ పూజను మొదలుపెట్టండి.