Big Stories

Kedarnath Temple :కేదార్ నాథ్ ఆలయం వెనుక శంకరా చార్య…

- Advertisement -

Kedarnath Temple : సరిగ్గా పదేళ్ల క్రితం కేదార్ నాథ్ ఆలయం దగ్గర వరద బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత చేపట్టిన రీడెవలెప్ మెంట్ పనులు ఇప్పటికీ కొలిక్కి వచ్చాయి. మరోసారి ప్రకృతి ప్రకోపించినా తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నాటి వరద బీభత్సానికి వరదల్లో కొట్టుకుపోయింది ఆదిగురు శంకరా చార్యుల విగ్రహం. 130 కోట్లతో చేపట్టిన ఆలయ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ విగ్రహాన్ని మళ్లీ పునః ప్రతిష్ట జరిగింది. ఈ మధ్యనే మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా పునర్ నిర్మించిన శంకరా చార్య విగర్హం బరువు 35 టన్నులపై మాటే ఉంది. మైసూరుకి చెందిన శిల్పులు ఈ విగ్రహాన్ని రూపొందించారు.

- Advertisement -

ఎలాంటి వర్షాన్ని అయినా తట్టుకుని నిలబడేలా శిల్పాను చెక్కారు. ఎంతటి క్లిష్టమైన వాతావరణాన్ని అయినా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. కేదార్‌నాథ్ ఆలయం వెనుక, సమాధి ప్రాంతం మధ్యలో ఈ ఆదిశంకరాచార్య ప్రతిమను నిర్మించారు. వేదాంతవేత్తగా , తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్య తొమ్మిదో శతాబ్ధంలోనే కేథార్ నాధ్ లోనే సమాధి చెందారని చరిత్ర చెబుతోంది. ఆదిశంకరాచార్య చరిత్రకు మించి ఆయన నమ్మకాలు, సంప్రదాయాలు ఈనాటికి కొనసాగుతున్నాయి. ఆయన నెలకొల్పాలు పీఠాలు ఇప్పటికీ ఉన్నాయి.

అద్వైతన సిద్దాంతాన్ని ప్రతిపాదించింది శంకరాచార్యాలే. సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి ఆదిశంకరగా జన్మించారని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు. ఎన్నో మఠాలను స్థాపించిన చరిత్ర శంకరాచార్యకి ఉంది. ఆదిగురిగా పిలుచుకునే శంకరాచార్యులు 116 రచనలు చేశారు. 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, సౌందర్య లహిరి సహా పలు కవితా రచనలు ఉన్నాయి. కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులేనని తన రచనల ద్వారా శంకరాచార్యులు చెప్పారు. శంకరస్మృతి వంటి గ్రంథాలను రచించిన ఘనత ఆదిశంకరాచార్యులదే. రని..కేవలం 32 ఏళ్ల జీవితంలోనే అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించిన మహిమాన్వితుడు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో హిందూ మతానికి పునరుజ్జీవ కర్తగా దారి చూపించారు. విదేశీ మూకల దాడుల నుంచి , స్వదేశీ కుట్రల నుంచి హిందుమతాన్ని కాపాడటంలో ప్రథముడు ఆదిశంకరాచార్యుడే అని గట్టిగా చెప్పాలి. అందుకే ఆదిగురుగా నిలిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News