EPAPER

Shani Vakri: శని తిరోగమనంతో కన్యా రాశి వారికి ఎన్నడూ ఎరుగని కష్టాలు !

Shani Vakri: శని తిరోగమనంతో  కన్యా రాశి వారికి ఎన్నడూ ఎరుగని కష్టాలు !

Shani Vakri: శని అనగానే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే ఏ పని చేసినా శని వల్ల కలసి రాదు..సమస్యలు పెరుగుతాయని కొందరు నమ్ముతారు. ప్రశాంతత లోపిస్తుంది,పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతాయని అంటుంటారు. కానీ ఎవరి కర్మలను బట్టి వారికి శని ఫలితాలను ఇస్తూ ఉంటాడు. క్రమశిక్షణకు కారకుడు కూడా శనిదేవుడిని చెబుతారు. ఎవరైతే జీవితాన్ని క్రమ పద్ధతిలో నిజాయితీగా గడుపుతారో వారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు. వారి జీవితంలో మంచి విజయాలు పొందుతారు.


శని తిరోగమనం చెందినప్పుడు కూడా కష్టపడి పని చేస్తే శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు. శనికి మూడు దశలు ఉంటాయి. ఈ దశలు కొనసాగుతున్నప్పుడు ఫలితాలు అంత త్వరగా రావు. శని వక్రగతి చెందినప్పుడు కన్యా రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది వారు ఎక్కువ ఎలాంటి విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వేటిపై అప్రమత్తంగా ఉండాలన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కన్యా రాశి వారు లోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోన్ సాల్వ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కానీ అంతకు ముందు చేసిన అప్పులు రుణాలు తీర్చలేకపోవడం జరుగుతుంది. ఈ సమయంలో శత్రువుల నుంచి బాధ ఎక్కువగా ఉంటుంది. నర దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీర్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులతో కాస్త ఆచి తూచి వ్యవహరించాలి.


ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించడం ఎంతైనా అవసరం. సరైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. యోగా, ధ్యానం, నడక ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి.
అనారోగ్య సమస్య తగ్గకపోతే అసలు సమస్య ఎక్కడ ఉంది.. ఎలాంటి మందులు తీసుకుంటున్నామనే దానిపై శ్రద్ధ వహించాలి. శని తిరోగమనం ప్రభావం కన్యా రాశి వారి ఆరో స్థానం మీద పడుతుంది. అష్టమ స్థానం మీద శని ప్రభావం ఉన్నప్పుడు దీని వల్ల ఇన్సూరెన్స్ బెనిఫిట్లు, డెత్ బెనిఫిట్లు చాలా ఆలస్యమవుతాయి. కాబట్టి ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

దూర ప్రయాణాలు కనుక చేయాల్సి ఉంటే ముందస్తు ప్రణాళికలతో వెళ్లాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కునే ప్రమాదం ఉంటుంది. నష్టాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు కన్యా రాశి వారు ధైర్యంగా ఉంటారు. కానీ శని తిరోగమనం చెందే సమయానికి మొత్తం మారిపోతుంటారు. ధైర్యంగా ముందడుగు అసలు వేయలేరు. మీ తోబుట్టువుతో పాత గొడవలు ఏదైనా ఉంటే కూడా వాటిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయండి. ఏ పని చేయాలని అనుకున్నా ధైర్యంగా ముందడుగు వేయండి. తోబుట్టువులతో సరైన బాంధవ్యం ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం.

Also Read: శష రాజయోగ ప్రభావం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు !

ప్రేమ వివాహం చేసుకోవడానికి వీరికి ఇది మంచి సమయం. సంతానానికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. వ్యాపారం చేస్తుంటే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి వారితో స్నేహం చేస్తే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కన్యా రాశి వారికి అనుకూలమైన ప్రాంతాల్లో ఉద్యోగ రిత్యా బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.

శనికి తైలాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పఠించాలి.

Tags

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

×