EPAPER

Sabarimala Yatra : ఇక నుంచి సులభంగా శబరిమల యాత్ర

Sabarimala Yatra : ఇక నుంచి సులభంగా శబరిమల యాత్ర
Sabarimala


Sabarimala Yatra : శబరిమల అయ్యప్పస్వామి భక్తులకి కేంద్రం శుభవార్త వినిపించింది. ఇక నుంచి అయ్యప్ప దర్శనం మరింత ఈజీగా ఫాస్ట్ గా అయ్యే ఏర్పాట్లు చేస్తోంది. దేశం నలువైపుల నుంచి శబరిమల చేరుకోవాలంటే రైలు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. శబరిమలకి నేరుగా విమానంలో చేరుకునే మార్గం లేదు. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో దిగి అక్కడ నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ శబరిమల చేరుకోలేని పరిస్థితి . ఇక నుంచి ఈ దూరం మరింత తగ్గనుంది. శబరిమలలో ఎయిర్ పోర్టు నిర్మించడానికి అడుగులు పడ్డాయి. . శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 3,411 కోట్లతో ఎరుమేలిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2వేల 5వందల 70 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. విమానాశ్రయం నుంచి పంబకు కేవలం 45 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.

శబరిమలకి అతి సమీపంలో ఎయిర్ పోర్టు వల్ల భక్తులకి ప్రయాణం మరింత సులువుగా మారబోతోంది. ఈమధ్య దేశంలో విమాన ప్రయాణికుల పెరుగుతూ వస్తోంది. గతంలో ఫ్లయిట్ జర్నీ అంటే కేవలం రిచ్ పీపుల్ కి మాత్రమే అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వర్గం కూడా అందుకునేలా ఫ్లయిట్ చార్జీలు ఉండటంతో.. ఎయిర్ పోర్టులోకి అడుగు పెట్టే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. దేశంలో జీవన ప్రమాణాలు పెరగడం వల్ల కూడా విమానాలు ఎక్కేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శబరిమలకు అతి సమీపంలో ఎయిర్ పోర్టు రావడం వల్ల అయ్యప్ప భక్తులకి మరో వెసులుబాటు కలిగింది. ఎక్కువ సేపు జర్నీ చేయకుండానే స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఏర్పడింది.దీని వల్ల సమయం బాగా ఆదా అవుతుంది.


ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు మాలను ధరించి, నియమ, నిష్ఠలతో పూజలు చేస్తూ అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్తుంటారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువమంది భక్తులు శబరిమలకి వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం భారీగా మకరజ్యోతి దర్శనం కోసం శబరి వెళ్తుంటారు.ఆ సమయంలో రైళ్లు, బస్సులు రద్దీతో కనిపిస్తుంటాయి.ఇప్పుడు వాయుమార్గం కూడా తోడయితే రద్దీ తగ్గుతుంది. జర్నీ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రోడ్డు, రైలు, మార్గాలతో పోల్చితే విమాన ప్రయాణం తక్కువ సమయం పడుతుంది.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×