Big Stories

Rohini Karte : రోహిణి కార్తె మొదలైంది…..

- Advertisement -

Rohini Karte : ఎండలతో అల్లాడిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ప్రచంఢ భానుడి భగభగలతో ఉడికిపోతున్నాయి. మే 25 నుంచి అంటే నేటి నుంచి రోహిణికార్తె మొదలైంది. గురు పుష్యయోగంలో సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వాతావరణంపై ప్రభావం ఉంటుంది. రోహిణికార్తెలో రోకళ్లు పగులుతాయని పెద్దలు చెబుతుంటారు. అంటే ఆస్థాయిలో ఎండలు ఉండబోతున్నాయి. తీవ్ర స్థాయిలో ఎండ తీవ్రత ఉంటుంది. హిందూ ధర్మంలో రోహిణి నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. రోహిణి అంటే సత్యం, అభివృద్ధికి గుర్తుగా భావిస్తుంటారు. రోహిణి కార్తెలో ఎండలు తీవ్రత ఊహించని విధంగా ఉంటుంది

- Advertisement -

వేసవి కాలం అంతా ఒక ఎత్తు, రోహిణికార్తెలో ఎండలు మరో ఎత్తు. రోహిణి నక్షత్రం ప్రభావం 14 రోజులపాటు ఉంటుంది. అంటే జూన్ 8 వరకు. సాధారణంగా వేసవి మొత్తంలో ఎండలు అత్యధికంగా ఉండేది ఈ కార్తెలోనే.గురుపుష్య యోగంతో రోహిణి నక్షత్రం రావడం మంచిది. దీని ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు పడతాయి. రోహిణిలో నక్షత్రంలోకి ఆదిత్యుడు రావడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. రోహిణి కార్తెకి రైతులకి సంబంధం ఉంది. కొత్త పంటలు వేసుకోవడానికి పనులు మొదలుపెట్టే సమయం కూడా ఇదే. రోళ్లు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేసి రోహిణి కార్తెతో ఎండాకాలం ముగిసిపోతుంది. దీని తరువాత ఒక్కో కార్తె వస్తూ ఉంటుంది. ఇలా వ్యవసాయ దారాలు ఒక్కో కార్తెలో ఒక్కో రకమైన వ్యవసాయ పనులు చేస్తుంటారు.

రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు , ఉక్కపోతలు ఉంటాయి. పశువుల, పక్షులు తాగేందుకు మీ ఇంటి బయట నీళ్లు తొట్టెలాంటిది ఏర్పాటు చేస్తే మీకు కుటుంబానికి మంచి జరుగుతుంది. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లటి నీళ్ళను అందించండి. ఇలాంటి సేవా కార్యక్రమాలతో మీ కుటుంబానికి ఉన్న గ్రహ బాధలు తొలగిపోతాయి. మీ సమస్యలకు పరిష్కారం మార్గం దొరికి కొంత ఉపశమనం కలుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News