EPAPER
Kirrak Couples Episode 1

Results Of Donations Made To The Temples : ఆలయానికి ఏ వస్తువులు దానం చేయాలి???

Results Of Donations Made To The Temples : ఆలయానికి ఏ వస్తువులు దానం చేయాలి???

Results Of Donations Made To The Temples : మన దగ్గరల్లో కానీ ఇంకా ఎక్కడకైనా గుడి కడుతున్నారంటే ఎవరికి తోచిన వారు చందా వారు ఇస్తుంటారు.. గుడి నిర్మాణాన్ని అందరూ ప్రోత్సహిస్తుంటారు. అయితే ఆ గుడికి ధనంతోపాటు కొన్ని వస్తువులు దానం లేదా విరాళంగా ఇవ్వడం చేయడం మంచిదంటున్నారు పండితులు. ఆల‌యానికి శంఖం దానం ఇవ్వ‌డం వ‌ల‌్ల మళ్లీ మానవ జన్మ ఎత్తితే గొప్ప‌ కీర్తిమంతుడు అవుతాడు. గుడిలో గంట‌ను దానంగా ఇవ్వ‌డం వ‌ల‌్ల కీర్తిని పొందుతారు. ఆల‌య గోడ‌ల‌కు సున్నం దానంగా ఇవ్వ‌డం, ఆల‌యం చూటూ ఉన్న ఆల‌య ప్రాంగ‌ణాన్ని ప్ర‌తి రోజూ ప‌రిశుభ్రంగా ఉంచ్చ‌డం, ఆల‌యం ముందు అంద‌మైన ముగ్గుల‌ను తిర్చిదిద్ధ‌డం వంటివి చేయ‌డం వ‌ల‌న వైకుంఠ లోకం ప్రాప్తి క‌లుగుతుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. అద్దం దానం చేయ‌డం వ‌ల‌్ల మంచి రూపం పొందుతారు..


గ‌జ్జ‌ల‌ను లేదా నువ్వుల‌ను దానం చేయ‌డం వ‌ల‌్ల సౌభాగ్యం క‌లుగుతుంది, క‌మండ‌ల‌వుల‌ను దానం చేస్తే గోదాన ఫ‌లితం ద‌క్కుతుందంట‌. ఆల‌యంలోని దేవుడి ప‌రిచ‌ర్య‌లు కోసం చిన్న చిన్న పాత్ర‌ల‌ను ఇస్తే స‌ర్వ‌కామ య‌జ్ఞ‌ం చేసినంత ఫ‌లం ల‌భిస్తుంది. మరికొందరు స్వామి వారి విగ్ర‌హ‌నికి వెండి, బంగారు, ఇత‌ర లోహ‌ల‌ను దానం చేస్తే పుణ్య‌ఫ‌లం ల‌భించ‌డ‌మే కాక , ప్ర‌తి ఒక్క కోరిక‌ సిద్ధిస్తాయట. స‌ర్వ కోరిక‌లు తీరుతాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చిన వారికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి.

పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగే ఎద్దును దానం చేస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలితం ఉంటుంది. వన్యమృగాలు, పక్షుల దానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని కలిగిస్తుంది. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి. నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి. దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను, వాయిద్య పరికరాలను దానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.


Tags

Related News

Weekly Lucky Zodiac Sign: సెప్టెంబరు చివరి వారంలో ఈ 5 రాశులపై లక్ష్మీ అనుగ్రహం

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Big Stories

×