EPAPER

Rahu Mahadasha: రాహు మహాదశ.. 18 ఏళ్లపాటు దుష్ట గ్రహ ప్రభావం

Rahu Mahadasha: రాహు మహాదశ.. 18 ఏళ్లపాటు దుష్ట గ్రహ ప్రభావం

Rahu Mahadasha: జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాల మహాదశ, అంతరదశను ప్రతి వ్యక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులు శుభ, అశుభ ఫలితాలు కలిగిస్తూ ఉంటాయి. నవ గ్రహాలలో రాహువును అంతుచిక్కని నీడ గ్రహంగా పిలుస్తారు. రాహు మహాదశ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి. అదే అశుభ స్థానంలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


రాహువు మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి? దాని నుంచి బయటపడేందుకు పాటించాల్సిన నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాహువు మహాదశ ఎన్ని సంవత్సరాలు:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. వ్యక్తి జాతకంలో 5,7,9 స్థానాల రాహువు దృష్టి ఉంటుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ స్థానాల్లో రాహువు ఉంటే రాహు మహాదశ అని పిలుస్తారు. రాహు మహాదశలో 3,6,9 సంవత్సరాల్లో అనుకూల, ప్రతికూల సంఘటనలు ఏర్పడతాయి. రాహువు మహాదశ 6,8 సంవత్సరాల్లో చాలా సమస్యలు ఎదురవుతాయి.
రాహు మహాదశ శుభ ఫలితాలు:
రాహువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి అనుకూలంగా ఉంటాడని చెబుతారు. జాతకంలో రాహు శుభ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిని పేదవాడి నుంచి రాజుగా మారుస్తుంది. అశుభ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిని పేదవాడిగా మార్చడంలో క్షణంకూడా సమయం పట్టదు. రాహువు శుభ స్థానంలో ఉంటే వ్యక్తులు చాలా గౌరవం, హోదా డబ్బు, పొందుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో రాహు స్థానం బలహీనంగా ఉంటే విజయం సాధించడంలో వ్యక్తి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మహాదశ సమయంలో వ్యక్తి సామాజిక ఆర్థిక హెచ్చుతగ్గులు అనుభవించేలా చేస్తుంది. ఈ సమయంలో వ్యక్తి శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా శత్రువుల వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో అనుకోని నష్టాలు కలుగుతాయి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది.


ప్రశాంతత కూడా లోపిస్తుంది. ఈ పరిస్థితి కారణంగా వ్యక్తి స్వభావం, చికాకు, కోపం ఆత్రుత, నిరాశకు గురవుతుంటారు. రాహు మహాదశ ప్రభావం వల్ల కొంతమంది కోర్టు కేసులో కూడా ఇరుక్కునే అవకాశాలున్నాయి. వాటిని వదిలించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఫలితంగా వారు కష్ట సమయాలను గడపవలసి ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తికి భయం, అనుమానం చుట్టుముడుతూ ఉంటాయి.

Also Read: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అంతటా విజయమే!

రాహు ప్రభావాలను నివారించడానికి మార్గాలు:

  • రాహు మహాదశకు అనుగుణంగా ప్రతి సోమవారం శివుడికి జలాభిషేకం చేయాలి. శివ పారాయణం పటించాలి.
  • రాహు మహాదశ ఉన్న వారు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి.
  • రాహు మహాదశలో ప్రతి శనివారం మర్రి చెట్టును పూజించడం మంచిది.

Related News

Mars Transit Horosope: ఉద్యోగులు, వ్యాపారస్తులకు కుజుడు శుభవార్తలు అందించబోతున్నాడు..

Shani Lucky Zodiacs: ఈ 3 రాశులపై శని ఆశీస్సులతో ఆనందం, డబ్బు పొందుతారు

Budh Gochar: బుధుడి సంచారం కన్యా రాశితో సహా ఈ 5 రాశులకు సిరి సంపదలు ఇవ్వనుంది

Durgapuja 2024 Vastu Tips: నవరాత్రుల్లో దుర్గాదేవి పూజలో ఈ వస్తువులు సమర్పిస్తే అదృష్టం తిరిగి వస్తుంది

Shardiya Navratri Day 3: రేపు శారదీయ నవరాత్రుల మూడవ రోజు.. చంద్రఘంటా దేవిని ఈ విధంగా పూజించండి

Bathukamma: నాలుగో రోజు బతుకమ్మ.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? సరైన తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Big Stories

×