EPAPER

Panchmukhi Hanuman : ఆంజనేయుడికి 5 అంకె ఇష్టమా?

Panchmukhi Hanuman : ఆంజనేయుడికి 5 అంకె ఇష్టమా?

Panchmukhi Hanuman : అంకెలలో 5 అంటే ఆంజనేయుడికి ఎంతో ఇష్టమని పురాణ పురుషులు. ఆంజనేయ స్వామి తల్లిదండ్రులపేర్లు చూస్తే .. వాయుదేవుడు , అంజనాదేవి పేర్లలో 5 అక్షరాలే . సీతారాములు’ , లక్ష్మణస్వామి’ లోనూ 5 అక్షరాలే . అంతేకాదు ఆయన పేర్లలో హనుమంతుడు , ఆంజనేయుడు లోనూ 5 అక్షరాలే . ఆయన తపస్సు చేసిన పర్వతము గంధమాదవ లోనూ 5 అక్షరాలే . ఇలా పంచముఖాంజనేయునికి ఈ ఐదు అంకె అంటే చాలా ఇష్టమని అంటారు .


ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడి భక్తులలో అగ్రగణ్యుడు గా భావిస్తారు.రావణుడు సీతాదేవి ని అపహరించినప్పుడు, సీతాన్వేషణలో శ్రీరామునికి ఎంతో సహాయపడ్డారు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు అంజనా దేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందు వల్ల ఆంజనేయుడు ఎంతో బలసంపన్నుడుగా అవతరించాడు. మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి, ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆ హనుమంతునికి పూజ చేసి హనుమాన్ చాలీసా పట్టించాలి.ఈ విధంగా 21 మంగళ వారాలు సూర్యోదయానికి ముందే పూజ చేయాలి.

ఆంజనేయునికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం ద్వారా ఎంతో ప్రీతి చెందుతాడు.అంతే కాకుండా కేసరిని నైవేద్యంగా స్వామివారికి సమర్పించటం ద్వారా ఆ ఆంజనేయుని అనుగ్రహం మనమీద కలుగుతుంది. మంగళవారం పూజ చేసేటప్పుడు స్వామి వారికి బెల్లం ముక్క ను, 5 అరటి పండ్లు తమలపాకులు సమర్పించి, స్వామివారికి దీపారాధన చేయాలి.ఇలా 21 మంగళవారాలు చేయడం ద్వారా గృహాల్లో ప్రతికూల వాతావరణం తొలగిపోయి, అనుకూల వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఈతిబాధలుపోయి ఆర్థికంగా ఎంతో రాణిస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.


హస్త,మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత గ్రంథాలు చెబుతున్నాయి

Tags

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×