Big Stories

Nagabali :- పెళ్లిలో చెక్కబొమ్మను ఎందుకు ఉంచుతారు…?

Nagabali :- హిందూమతంలో పెళ్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇద్దరు వ్యక్తుల్ని ఒక్కటి చేసేది వివాహం. ప్రాంతాలకు తగ్గట్టు పెళ్లిల్లో సంప్రదాయాలు, ఆచారాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాలకు రాష్ట్రాలకు కూడా చాలా తేడాలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఆచరించేది ఒక విధానం నాగబలి. వివాహ వ్యవస్థ మొదలై వేల ఏళ్లు గడుస్తున్నా కొన్ని పద్దతులు ఇప్పటికీ మార్పులు చెందుతూ ఆచరణలోనే ఉన్నాయి. పెళ్లిని 16 భాగాలుగా లెక్కిస్తారు. నాగ బలి అనేది పెళ్లిలో 13వ సంస్కారం. గర్బాదానం, సీమంతం, జాతకర్మ, నామకర్మ ఇలా సంస్కారాలు ఉంటాయి. వీటిలో కొన్ని అయ్యవారు నిర్వహిస్తారు. పెళ్లిలో నాగబలిని వరుడే నిర్వహిస్తాడు.

- Advertisement -

పెళ్లిలో సుమూహర్తం, కన్యాదానం, జీలకర్రబెల్లం, తాళిబొట్టు, తలంబ్రాలు ఏ పెళ్లిలో అయినా ఇవి అందరికీ తెలుసు. ఎక్కువగా గుర్తుండిపోయే సంస్కారాలు కూడా ఇవే. పెళ్లి ఆరంభంలో కూడా చాలా తంతును నిర్వహిస్తారు. అది ప్రాంతాన్ని, కులాన్ని బట్టి కూడా మారుతుంటాయి. పెళ్లికి ముందు వరుడు, వధువు వేర్వేరుగా పూజలు కూడా చేస్తారు. ఆ తర్వాత చేసే కార్యక్రమం నాగబలి లేదా నాగవలి. అద్బుతమైన ఈ సంస్కారాన్ని వైదిక సంస్కృతి మనకు అందించింది. అమ్మాయిని , అబ్బాయిని ఒక చోట కూర్చోబెట్టి ఉత్తమ సంతానం కలగాలని చేసే వేడుక నాగబలి.

- Advertisement -

సంతానం విషయానికి వస్తే నాగులకి ప్రత్యేకత ఉంది. పిల్లలను పుట్టనవారు సంతాన ప్రాప్తి కోసం నాగదేవతుల్ని పూజిస్తుంటారు. ఎందుకంటే సంతానం ఎక్కువ కలిగి జాతుల్లో నాగుల్లోనే అధికంగా ఉంటుంది. పుట్టకి పూజలు చేయడం, వేపచెట్టకు పూజ చేయడం, రావి చెట్టును ఆరాధించడం కూడా ఇవన్నీ ఇలాగే పుట్టాయి. నాగవలిలో నాలుగు గురువుల వేసి చుట్టూ దారాలు కట్టి మధ్యలో బియ్యం పోసి ఉంచుతారు. దేవతారాధన చేస్తారు . అందులో చిన్న చెక్క బొమ్మను ఉంచుతారు . దాన్ని శిశువుగా మార్చి వస్త్రం చుట్టి ఊయలలో పెట్టి చివరకి అమ్మాయి కొంగుకి కడతారు. కొత్త దంపతులకు మంచి సంతానం కలగాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News