BigTV English

Naga Tantram : నాగ తంత్రంతో వాస్తుదోషాలు తొలగిపోతాయా ..

Naga Tantram : నాగ తంత్రంతో వాస్తుదోషాలు తొలగిపోతాయా ..

Naga Tantram : ఈరోజుల్లో అప్పులు చేయని మనిషి కనిపించడం కష్టం. కొంతమంది అవసరాలకు మించి అప్పులు చేసి తీర్చలేక సతమతం అవుతుంటారు. అనుకోని కష్టాలతో అప్పుల ఊబిలో మరికొందరు చిక్కుకుపోతుంటారు. వాస్తు పరమైన దోషాలు దీనికి కారణం కావచ్చు. ఈ అప్పుల బాధ నుంచి బయటపడటానికి నాగ తంత్రం పాటిస్తే సరిపోతుందని పరిహారశాస్త్రం చెబుతోంది. కృష్ణ పక్ష పంచమి లేదా శుక్ల పక్ష పంచమి లో ఎప్పుడైనా ప్రారంభించి, తరువాత శుక్ల పక్ష మరియు కృష్ణ పక్ష పంచమి రెండింటిలోనూ5 పంచమి తిథులలో కొనసాగించి పూర్తి చేయాలని పండితులు చెబుతున్నారు.


గోధుమ పిండి లో కొంచెం పసుపు పొడి పాల మిశ్రమాలతో పిండి ముద్ద చేసుకోవాలి. ఈ పిండితో ఐదు చిన్న సైజు బంతులు, ఒక పెద్ద సైజు బంతి లా తయారు చేసుకోవాలి.5 చిన్న సైజు బంతులను ఉపయోగించి చిన్న నాగ ప్రతిమలు, పెద్ద నాగ ప్రతిమ సిద్ధం చేయాలి. నాగ ప్రతిమకు తోక, పడగ ప్రధానంగా ఉండేలా పిండి ముద్దతో తయారుచేసుకోవచ్చు.

నాగ ప్రతిమలను పిండితో తయారుచేసిన తరువాత, మీరు అక్షతలు, తెల్లని పువ్వులో పూజ చేయాలి. చందనం లేదా పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించాలి. అగరబత్తి తో ధూపం వేసి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె లేదా నెయ్యిని నింపి దీపాలు వెలిగించాలి. ఖండ శక్కర ముక్కలు పాలను నైవేద్యంగా సమర్పించాలి. అప్పులు, దీర్ఘకాలిక రుణాల భరించలేని భారం నుండి విముక్తి కలిగించాలని పూర్తి భక్తి విశ్వాసాలతో నాగ దేవతలను ప్రార్ధించాలి.


పూజ పూర్తైన అన్ని వస్తువులను తాకకుండా ఒకే చోట ఉంచాలి. మరుసటి రోజు, 6 నాగ ప్రతిమలను ఇతర పూజ సామాగ్రినంతటిని ఇంటి నుండి దూరంగా ఉన్న ప్రదేశంలో ఏదైనా చెట్టు కింద ఉంచి వెనక్కు చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఆ తరువాత వరుసగా 5 పంచమి తిథుల లో ఇదే విధంగా పూజ చేయాలి. ఈ పరిహారం తీవ్రమైన అప్పులు, దీర్ఘ కాలిక రుణాల భరించలేని భారం నుండి విముక్తి కల్పిస్తుంది.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×