Big Stories

Molathadu : మగవాళ్లు మొలతాడు బుధవారమే కట్టుకోవాలా?

Molathadu:మొలతాడు లేకపోతే మగవాడే కాదన్న సామెత ఉంది.మగవాళ్లు అందరు మొలతాడు కట్టుకుంటారు కానీ .చాలా మందికి అది ఎందుకు కట్టుకోవాలని ఈ పద్దతి పెట్టారో తెలుసుకుందాం. చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయ‌ట‌. ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా పెరుగుద‌ల ఉండేందుకు క‌డ‌తార‌ు. మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంద‌ని వైజ్ఞానికంగా నిరూపితమైంది. హిందూ ధర్మాన్ని ఆచరించే వారు మగవారు నడుముకు నలుపు లేదా ఎరుపు రంగు దారాన్ని కట్టుకుంటారు.

- Advertisement -

ఈ ఆచారం వెనక మరో కారణం కూడా ఉంది. స్నానం చేసేటప్పుడు మగవారు పూర్తిగా నగ్నంగా ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. కనీస గుడ్డ అయినా ధరించాలి అని వేదాలలో చెప్పబడింది. పూర్వకాలంలో అందరూ నదుల్లోనే స్నానం ఆచరించే వారు. ఒక్కోసారి కొన్ని పరిస్థితుల కారణంగా గుడ్డ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో మొలతాడు పవిత్రమైంది, కాబట్టి ఎలాంటి పాపం అంటుకోదని ధరించేవారు. అలాగే గుడ్డను ముడివేయటానికి రక్షణగా కూడా ఉండేది. ఆడవారికి మంగళసూత్రం ఎలాగో, మగవారికి మొలతాడు అలాంటిదే.

- Advertisement -

శ్రీకృష్ణదేవరాయల ఆమూక్త మాల్యద, శ్రీనాథుడి శృంగార నైషాధంలాంటి గ్రంథాల్లో మొలతాడు ప్రస్తావన ఉంది. చిన్న కృష్ణుడు బంగారు మొలత్రాడు గురించి చిన్నప్పుడు పాఠాల్లో కూడా ఉంది. మగవాడి భార్య కాలం చేస్తే మొలతాడు ఉంచుకోవద్దన్న నానుడి కూడా ఉంది. ఎవరైనా వ్యక్తి చనిపోతే ఒంటిపై నుంచి తొలగించే ఆఖరి వస్తువు మొలతాడే. మొలతాడు మార్చుకోవాలనుకుంటే బుధవారం ఉత్తమమైన రోజుగా పెద్దలు చెబుతారు. బుధవారం కుదరని పక్షంలో ఆదివారంలోనైనా ధరించవచ్చు . వారంలో ఈ రెండు రోజులు మాత్రమే మార్చుకోవడానికి అనుకూలమైన సమయం. అది కట్టుకునేటప్పుడూ కూడా తూర్పు ముఖంగా ఉండాలి. బుధవారం కట్టుకంటే ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతోంది . మొలతాడు కట్టుకున్న తర్వాత సూర్యభగవానుడ్ని పూజించాలి.

కడుపులోకి వెళ్లే ఆహారాన్ని మొలతాడు కంట్రోల్ లో పెడుతుంది. తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు పెరగటాన్ని తెలియజేస్తుంది. పొట్టు పెరుగుతోందా లేదా అన్నది మొలతాడు చెబుతుంది. ఎర్రటి మొలతాడు కంటే నల్లటి దారమైతే ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది. వృషణాలు అధిక వేడికి గురైతే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది.అందుకే వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News