EPAPER

Mirrors and Vastu: ఇంట్లో అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు, అలా ఉంచితే జరిగేది ఇదే!

Mirrors and Vastu: ఇంట్లో అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు, అలా ఉంచితే జరిగేది ఇదే!

Mirrors and Vastu: అద్దాలు ప్రతి ఇంట్లో లేదా ప్రతి గదిలో ఉండడం సహజం. పెద్ద హాల్లో ఎక్కువ అర్దాలు ఉండే అవకాశం కూడా ఉంది. చిన్నవైనా, పెద్దవైన అద్దాలను మాత్రం ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదని చెప్పుకుంటారు. విభిన్న ఆధ్యాత్మిక ఆచారాలు, సంస్కృతులు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో అద్దాలు ఎదురెదురుగా పెట్టకూడదని ఆచారం కూడా కొన్నింటిలో ఉంది. దీనికి వెనుక ఉన్న కారణం కూడా వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.


అద్దాలు – ఆత్మలు
అద్దాలకు, ఆత్మలకు మధ్య అనుబంధం ఉందని ఎన్నో సంస్కృతుల్లో నమ్ముతారు. అద్దాలు, ఆత్మలను సంగ్రహిస్తాయని చెబుతారు. అవి మిమ్మల్ని కాదు మీ ఆత్మను కూడా ప్రతిబింబిస్తాయని అంటారు. జానపద కథలలో అద్దాలు తరచుగా ఆత్మను బంధిస్తాయని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కువసేపు అద్దంలో చూస్తే మీ ఆత్మ లోపలి చిక్కుకు పోతుందని చెప్పేవారు కూడా ఉన్నారు. ఎన్నో పురాణాలు, ఇతిహాసాలలో అద్దాలు, ఆత్మలు లేదా శక్తులను ఇతర ప్రపంచాల నుండి మన ప్రపంచంలోకి అనుమతించే గేట్‌వే లుగా కూడా చెప్పుకుంటారు. ఎన్నో సినిమాల్లో కూడా అద్దాలను ఇలా ఆత్మలను సంగ్రహించే వస్తువులుగా వాడి చూపించారు.

షెంగ్ షూయ్ లో అద్దాలు శక్తిని ప్రతిబింబించే, శక్తిని పెంచే వస్తువులుగా చెప్పుకుంటారు. ఈ అద్దాలను తప్పుడు ప్రదేశంలో ఉంచడం వల్ల శక్తి ప్రవాహానికి భంగం కలుగుతుందని అంటారు.


Also Read: ఈ రాశి వారికి తిరుగులేని విజయాలు.. గురుధ్యానం మంచిది!

రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదని ఎన్నో సంస్కృతుల్లో చెప్పుకుంటారు. దీన్ని ఇన్ఫినిటీ మిర్రర్ ప్రభావం పడుతుందని అంటారు. ఇది నిరంతరం శక్తి ప్రవాహంలో అవాంతరాలను సృష్టిస్తుంది. ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. అయోమయంలో ఉన్న ఆత్మలు ఈ ప్రపంచంలోకి రావడానికి ఒక మార్గాన్ని ఈ రెండు అద్దాలు ఏర్పరుస్తాయని అంటారు. ప్రతికూల శక్తులు వేరే ప్రపంచం  నుంచి మన ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు అద్దాలను వాడుకుంటాయని నమ్ముతారు.

రెండు అద్దాలు ఎదురెదురుగా ఉండడంవల్ల ఇంట్లోని వారికి మైకము, ఆందోళన కలగడం, దిక్కుతోచని స్థితిలోకి వెళ్లడం వంటి లక్షణాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి ఇంట్లో పెరిగిపోయి వారు అనుకున్న పనులు జరిగే అవకాశం తగ్గిపోతుంది.

అనుకోకుండా రెండు అద్దాలు ఎదురెదురుగా పెట్టినట్టయితే వాటిని తొలగించలేని పరిస్థితుల్లో ఒక అద్దానికి ఏదైనా క్లాత్ ను కప్పి ఉంచడం మంచిది. ఇది ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది.  అద్దాలను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. పవిత్రమైన నీటితో వాటిని తుడవడం చాలా మంచిది.

Related News

Anuradha Nakshatra: అనురాధ నక్షత్రంలోకి శుక్రుడి సంచారం.. 3 రాశుల వారికి ధనలాభం

Saturn Retrograde: నవంబర్ 15న కుంభ రాశిలోకి శని ప్రవేశం.. 4 రాశుల వారిపై సంపద వర్షం

Horoscope 16 october 2024: ఈ రాశి వారికి తిరుగులేని విజయాలు.. గురుధ్యానం మంచిది!

Lakshmi Puja 2024: లక్ష్మీదేవి మంత్రం జపిస్తే మీ జీవితాన్ని సమృద్ధిగా డబ్బుతో నింపుతుంది

Guru Vakri 2024: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలో గురుడు తిరోగమనం.. 119 రోజులు ఈ 3 రాశుల వారి జీవితంలో ఆనందమే

Tulsi Chalisa Benefits: కోరికలు తీరి, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి!

Big Stories

×