EPAPER

Budh Gochar: అక్టోబర్ 10 నుంచి ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Budh Gochar: అక్టోబర్ 10 నుంచి ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Budh Gochar: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. గ్రహాల రాకుమారుడు, బుధుడు 2024, అక్టోబర్ 10, గురువారం నాడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతే కాకుండా అక్టోబర్ 29 వరకు ఇక్కడే ఉంటాడు.ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది.గ్రహాల రాకుమారుడు, బుధుడు 2024, అక్టోబర్ 10, గురువారం నాడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు.


అక్టోబర్ 29 వరకు ఇక్కడే ఉంటాడు. తెలివితేటలు, స్నేహం, తర్కం, తెలివి, కమ్యూనికేషన్, ప్రసంగం, ఏకాగ్రత, అందం, చర్మానికి బాధ్యత వహించే గ్రహం అయిన బుధుడు ఈ రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయంలో సమస్యలు పెరుగుతాయి. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారికి బుధ సంచారము అంత మంచిది కాదు. ఈ వ్యక్తులలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, దీని కారణంగా ఆఫీసుల్లో అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదే కాకుండా, మీరు శత్రువుల వల్ల కూడా ఇబ్బంది పడతారు. ఆదాయం తగ్గడం వల్ల మనస్సు బాధగా ఉంటుంది, ఇది పనులను పాడు చేస్తుంది. పనులు పెండింగ్ లో పడతాయి. మొదలు పెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. శత్రువుల నుంచి బాధలు పెరుగుతాయి.


సింహ రాశి :
సింహ రాశి వారికి బుధుడు రాశిలో మార్పు అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు వారి కార్యాలయంలో పనితీరులో క్షీణతను చూడవచ్చు. ఆఫీస్‌లో మీ స్వంత సహోద్యోగులు ఊసరవెల్లిలా ప్రవర్తిస్తారు. దీని వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. కార్యాలయంలో చిన్న పొరపాటు మీకు పరువు నష్టం కలిగిస్తుంది. అంతే కాకుండా మీరు తీసుకునే నిర్ణయాలతో సమస్యలు పెరుగుతాయి. సహొద్యోగులతో జాగ్రత్తగా మెలగండి. పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తుల రాశి:

బుధుడు తులారాశిలో మాత్రమే సంచరిస్తున్నాడు. తుల రాశి వారు ఈ సంచారం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వ్యక్తులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. విద్యార్థులు చదువులో అపజయాన్ని ఎదుర్కోవచ్చు. అజాగ్రత్త వల్ల హాని కలుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి.

Also Read: గ్రహాల సంచారం.. వీరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయ్

కుంభ రాశి:
గ్రహాల రాకుమారుడి రాశి మార్పు కుంభ రాశి వారిపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యక్తులు ప్రయాణ ఖర్చుల కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిలో నిర్లక్ష్యం కారణంగా నష్టపోతారు. ఇంట్లో అశాంతి పెరుగుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు.జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.  దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. కుటుంబ సభ్యలు మధ్య అశాంతి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Grah Gochar: 3 గ్రహాల సంచారం.. వీరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయ్

Horoscope 8 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. దైవారాధన మానవద్దు!

Durga Puja 2024: మహాషష్టి పూజ ఎప్పుడు ? తేదీ, పూజకు సంబంధించిన వివరాలు ఇవే

Astrology tips on Dussehra: దసరా నాడు ఈ పనులు చేస్తే త్వరలో మీరు కూడా ‘అదానీ-అంబానీ’లు కావచ్చు

Maha Ashtami 2024: మహా అష్టమి నాడు ‘మహా సంయోగం’.. 3 రాశులకు ఆర్థిక లాభాలు

Surya Gochar: అక్టోబర్ 17న తులా రాశిలోకి సూర్యుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం వరిస్తుంది

×