Big Stories

MellaChervu Shivaya : మేళ్ల చెర్వు శివయ్య మహత్యం

MellaChervu Shivaya

MellaChervu Shivaya : మనదేశంలో ఎన్నో వేల శివాలయాలు ఉన్నాయి. శివాలయాలు లేని ఊళ్లు దాదాపు కనిపించవు. కానీ కొన్ని శివాలయాలు భక్తుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఆ కోవలోకి వచ్చేది సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువు శివాలయం. ఆలయం నిర్మాణం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల పాలనాకాలంలో గ్రామం వెలుపల గుండ్రని లింగాకారపు రాయి కనిపించింది. యాదవులు ఇక్కడే జీవాలను పోషిస్తుండేవారు.

- Advertisement -

ఓ గోవు నిత్యం ఆ లింగానికి తన పాలధారతో అభిషేకం చేసేదట. ఓ రోజు యాదవులకు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తాను మహాశివుడిని అని, తనకు ఇక్కడ ఆలయం నిర్మిస్తే దక్షిణ కాశీగా వెలుగొందుతుందని చెప్పాడట. అప్పటి నుంచి ఆలయం ఖ్యాతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ శివలింగం ప్రతి పన్నెండేళ్లకోసారి అంగుళం చొప్పున పెరుగుతుందని తెలుస్తుంది. శివలింగానికి సింధూరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుంటాయి.

- Advertisement -

లింగం వెనుక భాగాన పార్వతీదేవి రూపం, కుడివైపున మూడు వేళ్లు పట్టేంత రంధ్రం కనిపిస్తుంది. శివలింగం నుంచి గంగాజలం ఎంత తోడినా వస్తూనే ఉంటుంది. ఏటా లింగం పరిమాణంలో మార్పు కనిపిస్తుందని ఆలయ అర్చకుడు తెలిపారు. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న స్వయంభువుడిని శివరాత్రి నాడు దర్శించుకుంటే శుభప్రదమని భక్తుల నమ్మకం. ఈ నెల 18న మహాశివరాత్రి రోజు వేకువజామున శివాలయంలో స్వామి వారికి అభిషేకాలతో జాతర మొదలుకానుంది.

సాయంత్రం ప్రభల ఊరేగింపు, రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 19న తెలుగు రాష్ర్టాల స్థాయి ఎద్దుల పందేలు ప్రారంభమవుతాయి. 20న ఉదయం రథోత్సవం, 21న రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, 22న రాత్రి పవళింపు సేవ, బహుమతి ప్రదానోత్సవంతో జాతర ముగుస్తుంది.ఈసారి స్వామి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆంధ్రతోపాటు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News