EPAPER

Marigold Flower: హిందూ పండుగలకు, వేడుకలకు బంతిపూలనే ఎందుకు ఎక్కువ వాడతారు? దీని వెనుక ఇంత కథ ఉందా?

Marigold Flower: హిందూ పండుగలకు, వేడుకలకు బంతిపూలనే ఎందుకు ఎక్కువ వాడతారు? దీని వెనుక ఇంత కథ ఉందా?

బంతిపూలు అనేక రంగుల్లో లభిస్తాయి. నారింజ, పసుపు రంగుల్లో దొరికే ఈ పువ్వులు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. హిందూ ఆచారాల ప్రకారం పూజలు, పండుగలు వేడుకలు వస్తే చాలు… బంతిపూలు ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఇంటిని అలంకరించడానికి ముఖ్యంగా దేవుని గుడిని అలంకరించడానికి బంతిపూలనే వాడతారు. వీటిని హిందూ దేవతలకు ఇష్టమైన పూలగా చెప్పుకుంటారు. బంతిపూలు లేకుండా ఏ పండగా పూర్తికాదు.


సూర్యునితో అనుబంధం
బంతిపూలకు సూర్యునితో అనుబంధం ఉందని హిందువులు నమ్ముతారు. ఇవి ప్రకాశవంతమైన నారింజ, పసుపు షేడ్స్ లో ఉంటాయి. సూర్యాస్తమయం, సూర్యోదయం అన్నది కూడా నారింజ, పసుపు షేడ్స్ లోనే కనిపిస్తాయి. అందుకే ఈ పువ్వులు ఎంతో శుభప్రదమైనవిగా నమ్ముతారు. ఈ పువ్వు పవిత్రమైన, శక్తివంతమైన అగ్నికి చిహ్నంగా చెబుతారు.

వినాయకుడికి ఇష్టమైన పువ్వు
లక్ష్మీదేవికి కమలం పువ్వు అంటే ఎంతో ఇష్టం. ఇక కాళీదేవికి మందారం అంటే ఇష్టం. అదే బంతి పువ్వు విషయానికి వస్తే విష్ణువు గణేశుడుకి ఎంతో ఇష్టమని చెబుతారు. లక్ష్మీదేవి కూడా బంతి పువ్వును ఎంతో ఇష్టపడుతుందని అంటారు. ఈ పువ్వులోని ప్రకాశవంతమైన రంగు దేవతలకు ఇష్టమైన పువ్వు గా మార్చేసిందని నమ్ముతారు. ఇది ఇంట్లో శాంతిని తీసుకురావడానికి సహాయపడుతుందని అందరి నమ్మకం. బంతిపూలతో వినాయకుడిని పూజిస్తే మీ మార్గంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆ గణేశుడు కాపాడతారని నమ్ముతారు.


Also Read: 2025లో ఈ 3 రాశుల ఉద్యోగం, వ్యాపారంలో భారీ మెరుగుదల

బంతిపూలను దండలుగా కుట్టి ఇంటి ద్వారాలకు అలంకరించవచ్చు. అలాగే గుడిని కూడా అలంకరించవచ్చు. బంతిపూల రేకులతో మాల కట్టి దేవతల చిత్రాలకు వేయవచ్చు. ఇంటి ద్వారాలకు బంతిపూలతో అలంకరిస్తే ఆ ఇంట్లోకి చెడు శక్తులు, ప్రతికూల గాలులు రాకుండా ఉంటాయని నమ్ముతారు. సానుకూల శక్తిని ఇంట్లోకి తెచ్చే సామర్థ్యం బంతిపూలకు ఉందని నమ్ముతారు. అందుకే పండుగలు, వేడుకలు ఏవైనా కూడా బంతిపూలతోనే ఇంటిని అలంకరిస్తారు.

Related News

sharad purnima 2024: శరద్ పూర్ణిమ నుండి ఈ 4 నక్షత్రాలకు అన్ని రకాల విజయాలు ప్రారంభమవుతాయి

Weekly Horoscope 21- 27th October: దీపావళి ముందు 4 రాశుల వారికి డబ్బుల వర్షం, మరో 3 రాశులకు ధన నష్టం

Guru Pushya Yog 2024: గురు-పుష్య యోగంతో మరో 10 రోజుల్లో ఈ రాశులకు అదృష్టం

New Year 2025 Lucky Zodiacs: 2025లో ఈ 3 రాశుల ఉద్యోగం, వ్యాపారంలో భారీ మెరుగుదల

Shadashtak Yog: షడష్టక యోగం.. దీపావళి వరకు 4 రాశుల వారికి కష్టాలు తప్పవు

Shani Rashi Parivartan: 161 రోజుల పాటు ఈ 4 రాశుల వారిపై శని అనుగ్రహంతో డబ్బుల వర్షం కురవబోతుంది

Big Stories

×