Big Stories

Kedarnath temple yatra :వచ్చే ఏడాది నాటికి కేదార్ నాథ్ కి మరో దారి…

- Advertisement -

Kedarnath temple yatra : ప్రకృతి సవాళ్ల మధ్య ప్రతీ ఏటా చార్ థామ్ యాత్ర మొదలవుతుంది. ముగింపు కూడా అలాగే ఉంది. ఏ క్షణాన ఎలాంటి వాతావరణం ఉంటుందో ఊహించలేని పరిస్థితి. అప్పుడే వానే, అప్పుడు మంచు ఇలా ఏదైనా జరిగిపోతుంటాయి. హిమాలయాలకు ఉత్తరదిశలోనే కేదార్ నాత్ ,బదరి,గ౦గోత్రి,యమునోత్రి ప్రాంతాలు ఉన్నాయి.

- Advertisement -

ఇక్కడి వాతావరణం వల్ల ఏటా ఆలయాలు ఆరు నెలలు తెరిచి ఉంటాయి మరో ఆరునెలలు మంచుతో కప్పబడి ఉంటాయి. సుందరమైన ప్రకృతి మధ్య ఆ దేవ దేవుళ్లు కొలువైన ప్రాంతాలు ఇవన్నీ. అక్షయ తృతీయ తర్వాత రోజు నుంచి ఆరునెలలు భక్తుల దర్శనార్ధం తెరచి ఉంటాయి. కానీ ఈ మధ్యలో కాలంలోనే వచ్చే విపత్తలు ఊహించలేని విధంగా ఉంటాయి. విపత్కర వాతావరణం మధ్య భక్తులు చార్ థామ్ యాత్ర చేసుంటారు. మార్గశిరమాసం ప్రారంభం ను౦డి గుడి తలుపులు మూసేస్తుటారు. అప్పటి నుండి మంచు దట్టంగా కురవట ౦మెుదలు అవుతుంది.

ఆది శంకరాచార్యులు కొలువైన ప్రాంతం కేథార్ నాథ్. పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదార్ నాద్ ఒకటి .దేవభూమి లో ఉన్న జ్యోతిర్లింగం. .వైశాఖ మాసం ను౦చి ఆశ్వ యుజం వరకు మాత్రమే ఈ జ్యోతిర్లిగాన్ని దర్శించగలం. అందుకే భక్తులు జీవితంలో ఒకసారైనా కేదారేశర్వుడి దర్శనం కోసం ప్రాణాలకి తెగించి వస్తుంటారు. ఎములకు కొరికే చలి ఉండే ఈ ప్రాంతంలో జర్నీ అంతా ఈజీ కాదు. ప్రమాదమైన కొండదారుల మధ్య ప్రయాణం సాగుతూ ఉంటుంది. హిమపాతం వల్ల ఈ ప్రాంతానికి రవాణా మార్గం అంతా కష్ట సాద్యంగా ఉంటుంది. అందుకే మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి పూర్తయ్యేలా కేధార్ నాథ్ కనెక్టీవిటీ ని పెంచుతోంది. గతేడాది ప్రభుత్వ రూ.3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. 9.7 కి.మీ పొడవైన గౌరీకుండ్- కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి

ఈ రోప్ వే అందుబాటులోకి వస్తే కేదార్ నాథ్ చేరుకోవడానికి మరో దారి ఏర్పడినట్టే. ప్రస్తుతం హెలిక్టాప్టర్ల ద్వారా కూడా ఇక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంది . కొంత వరకు వాహనాల్లో కూడా ఆలయం సమీపం వరకు చేరుకునే దారులున్నాయి. అయితే సవాళ్ల మధ్య ప్రయాణం సాగాల్సి ఉంటుంది. వాతావరణ అననుకూలత మధ్య యాత్ర నిలిచిపోతూ ఉంటుంది. అందుకే ప్రభుత్వం కేధార్ నాధ్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రోప్ వే కనెక్టవిటీ మార్గాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News