Big Stories

Kartika Somavaram : కార్తీక సోమవారం విశిష్టత

Kartika Somavaram

Kartika Somavaram : కార్తీకమాసం ప్రత్యేకత, ప్రాముఖ్యతను మానవజాతి సంక్షేమం కోసం నారాయణుడు బ్రహ్మకు, బ్రహ్మ నారదుడికి , నారదుడు పృథురాజుకి మొదటి వివరించాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. ఈ సష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏకార్యానికైనా శివుడి లేనిదే ముందుకు నడవదు. ఈ కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. ఈ కార్తీకం లో వచ్చే ఏ సోమవారం ఈ రోజైనా సరే స్నానం జపాదులను ఆచరించేవారు అశ్వమేధ యాగాలు ఫలాన్ని పొందుతారు.కార్తీక సోమవారం నాడు ప్రత్యేకంగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు.

- Advertisement -

కార్తీక మాసంలోని ప్రతి సోమవారం శివునికి ఎంతో ఇష్టమైనదిగా చెబుతారు. సోమ అంటే శివుడికి మరో పేరు కూడా. సోమ అంటే చంద్రుడుని తలపై ధరించడం వల్ల సోమేశ్వరుడిగా శివుడు పూజలందుకుంటాడు. అందుకే కార్తీక సోమవారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.కార్తీకమాసంలో సోమవారాల్లో ప్రత్యేక ఆచారాలు, , ఉపవాసాలు పాటిస్తారు. ప్రత్యేకించి శ్రావణమాస, కార్తీక మాసంలోని సోమవారాలను శివభక్తులు పవిత్రమైనవిగా భావిస్తుంటారు.

- Advertisement -

దక్షుని శాపం నుంచి తప్పించుకోవడానికి , శివుని నుంచి ఆశ్వీరాదం, అతని తాళాలలో స్థానం పొందడానికి చంద్రుడు సోమవారం వ్రతం ఆచరిస్తాడని నమ్ముతారు.మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ పవిత్ర మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం, శివునికి ప్రార్థనలు చేయడం, రుద్రాభిషేకం, చేయడం అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల గొప్ప పుణ్యాలు లభిస్తాయి,

కార్తీక సోమవారాలు
అక్టోబర్ 31
నవంబర్ 7
నవంబర్ 14
నవంబర్ 21

కార్తీక మాసంలో ఉపవాసం చాలా ముఖ్యం. ఉపవాసం పేరుతో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ మాసమంతా సాత్విక ఆహారానే తీసుకోవాలి.ఉపవాస సమయంలో మైదా పిండి, గోధుమపిండి, శనగపిండి మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎర్ర మిర్చి, ధనియాల పొడి వంటి స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. మాంసాహారం, మద్యానికి కూడా దూరంగా ఉండాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News