Kartika Deepotsavam: కార్తీక మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివారాధన శ్రేష్టమైనదిగా చెబుతారు. ఈ కార్తీకమాసానికి హరిహర మాసం అనే పేరు కూడా ఉంది. శివకేశవులకు అభేదంగా ఇరువురుని సమానంగా పూజించే మాసం కార్తీక మాసం. కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభమయింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పీఎస్సాఆర్ కన్వేన్షన్ హల్‌లో కార్తీకదీపోత్సవం కార్యక్రమం నవంబర్ 3 నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 .30 నుండి 9 గంటలకు కార్తీకదీపోత్సవం వేడుక ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమాన్ని బిగ్ టీవి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సంయుక్తగా నిర్వహిస్తున్నారు. కార్తీకదీపోత్సవం కార్యక్రమం బిగ్ టీవి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అనేక కార్యక్రమాలు, దీపాల తేజస్సుతో ప్రత్యేక అలంకరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బిగ్ టీవి యాజమాన్యం అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలో ఐదువేల మంది ఆడపడుచులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కోలాటం, క్లాసికల్ డాన్స్, లలిత పారాయణం, ప్రవచనాలు, శ్వేతార్కగణపతి ఉత్సవ మూర్తులకు అభిషేకం, భద్రకాళి-భద్రేశ్వర కల్యాణం, దీపోత్సవం వంటివి నిర్వహించనున్నారు.
Also Read: అద్భుతం శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలు
దీపారాధన..
కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో శ్రేయష్టకరం. దేవాలయాల్లో గాని, ఇంట్లోగాని సాయంత్రం సమయంలో దీపారాధన చేయడం వల్ల దైవానుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. కార్తీకమాసంలో దీపారాధన చేస్తే చాలు.. సర్వవిధ పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు. జ్ఞానం, మోక్షం, సర్వ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. కార్తీకమాసంలో దీపారాధన చేయడం వల్ల స్త్రీలకు విశేష ఫలప్రదము జరుగుందని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఆర్ధిక లాభం, ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెబుతారు. సూర్యాస్తమ సమయంలో దీపారాధన చేస్తే.. ఆర్ధిక బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో పాటు కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి ఏడు జన్మల వరకూ వైధవ్యం కలగదని పురాణాలు చెబుతున్నాయి.