EPAPER

Karthika Masam 2024: కార్తీక మాసం విశిష్టత.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Karthika Masam 2024: కార్తీక మాసం విశిష్టత.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Karthika Masam 2024: కార్తీక మాసం శివుడికి అంకితం చేయబడిన మాసం. ఈ మాసంలో ఉపవాసాలు, శివుడి ఆరాధన పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం కూడా ఒకటి. నవంబర్ 2 , 2024 నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. డిసెంబర్ 1 న ముగుస్తుంది. ఈ మాసం ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది.


కార్తీక మాసంలో పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు పూజలు, వ్రతాలు, ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఈ మాసంలో ముఖ్యంగా ఉపవాసాలు ఉంటారు.  కార్తీక మాసం చివరలో ఉపవాసాలు విరమిస్తారు. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చేసి ఉసిరి చెట్టుకు పూజలు చేస్తారు. అంతే కాకుండా దీపాలు కూడా వెలిగిస్తారు. కార్తీక మాసంలో భక్తులు శివాలయాలను సందర్శించి , అభిషేకం చేసి, శివలింగానికి బిల్వ పత్రాలు కూడా సమర్పిస్తారు.

దీపారాధన:
దేవాలయాలు, ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. అంతే కాకుండా దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు. కార్తీక పౌర్ణమి (నవంబర్ 15 )రోజు 365 వత్తులను వెలిగించి పవిత్ర నదిలో స్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఈ మాసంలో భక్తులు ఉసిరి చెట్ల క్రింద దీపాలను వెలిగిస్తారు. గత జన్మ పాపాలను పోగొట్టి, దేవతల అనుగ్రహం కలగాలని భక్తులు ఉసిరి చెట్ట క్రింద దీపాలను వెలిగిస్తారు.


ఉపవాసం, ఆహారం: ఈ నెలలో భక్తులు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసాలు ఉంటారు. మాసం, ఉల్లిపయాలు, వెల్లుల్లి తినకుండా ఉంటారు.

కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి ?

కార్తీక మానంలో శరదృతువులో వస్తుంది. ఈ సమయంలో నదుల్లో ఔషధ సారం ఉంటుందని చెబుతారు. ఈ పవిత్ర జలంలో సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే మానసిక, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని చెబుతారు. అంతే కాకుండా సూర్యోదయానికి ముందు చేసే నదీ స్నానం ఉదర సంబంధిత రోగాలను కూడా తగ్గిస్తుందట. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు విణ్ణు సన్నిధిలో శ్రీ హరి కీర్తనలు గారం చేస్తే వేల గోవులను దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది.

కార్తీక మాసంలో రావి చెట్టు మొదట్లో లేదా , తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి భగవంతుడిని స్మరించుకోవాలి. కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేసి శివుడిని ఆరాధిస్తే పుణ్య ఫలం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

Related News

Thathastu Deities: తథాస్తు దేవతలు నిజంగా ఉన్నారా? వారు ఎవరు? ఏ సమయంలో భూమి పై తిరుగుతారు?

Horoscope Nov 4: ఈ రోజు మేష రాశి నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుందంటే..

Chandra Gochar: చంద్రుడి సంచారం.. నవంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Karthika Deepotsavam Live: ‘బిగ్ టీవీ’ కార్తీక దీపోత్సవాన్ని కనులారా వీక్షించండి

Weekly Horoscope Nov 3 to 9: ఈ వారమంతా మీకు ఎలా ఉండబోతుందంటే..?

Rahu Transit Aquarius: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్

Big Stories

×