EPAPER

Shash Rajyog: శష రాజయోగ ప్రభావం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు !

Shash Rajyog: శష రాజయోగ ప్రభావం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు !

Shash Rajyog: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం న్యాయం, కర్మలకు అధిపతి శనిదేవుడు. 2023 జనవరి 17వ తేదీన కుంభ రాశిలోకి శని ప్రవేశించాడు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఈ రాశిలో ఉన్న తర్వాత శని రాశి మార్పు చెందుతాడు. 2025 మార్చి 29వ తేదీన శని మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. నవగ్రహాలలో శని గ్రహం చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. శనిదేవుడు కుంభ రాశిలో సంచరించినప్పుడు పంచ మహాపురుష రాజ యోగాల్లో ఒకటైన శష రాజయోగాన్ని సృష్టించాడు.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశి వారి మూల త్రికోణ రాశి ఇందులో శని ప్రవేశించినప్పుడు రాజయోగం ఏర్పడుతుంది. శనిగ్రహం 2024 జూన్ 30వ తేదీ నుంచి తిరోగమనంలో ప్రయాణిస్తుంది. వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క శక్తి సామర్థ్యాలు, ఫలితాలనిచ్చే ప్రభావాలు అనుచితంగా మారుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో అతను సృష్టించిన రాజయోగం వాటంతట అవే తొలగిపోతాయి.

శనిదేవుడు మొత్తం 139 రోజులు అంటే నాలుగు నెలల 19 రోజుల పాటు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాడు. ఈ స్థితిలో ఆయన సృష్టించిన శష రాజయోగం అక్కడితో పూర్తి పూర్తవుతుంది. శషరాజయోగ భంగం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే ఇది 5 రాశులపై ప్రత్యేక ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శని తిరోగమన ప్రభావం..
ధనస్సు రాశి:
మీ జీవితంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా పనులు పూర్తికాక ధన ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది సహోద్యోగులతో, యజమానులతో సంబంధాలు చెడిపోతాయి. మీకు ఇష్టం లేని ప్రదేశానికి మీరు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మీ మనస్సు చంచలంగా ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో క్షీణత ఉంటుంది.
సింహ రాశి:
సింహరాశికి అధిపతి సూర్యుడు. నలుగురిలో మీరు గుర్తింపును కోరుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విశ్వాసం తగ్గుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. జీవితంలో ఆర్థిక సంక్షోభం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ పదవులను కోల్పోయే ప్రమాదముంది. సామాజిక గౌరవం తగ్గుతుంది. అంతేకాకుండా పాత వ్యాధులు తిరగబడే అవకాశం ఉంది.
మిథున రాశి:
భాగస్వామ్య వ్యాపారాలు మీకు అంతగా కలిసిరావు. ఏమున్నా మీరు ఒక్కరిగా వ్యాపారం ప్రారంభింస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో కొంచెం లాభాలు తగ్గే అవకాశాలున్నాయి. అందుకు మీ కార్మికులే కారణం కావచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాహన సంబంధ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాధుల వల్ల ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. భూమి ఆస్తుల విషయంలో వివాదాలు పెరుగుతాయి. అన్నయ్య లేదా సోదరితో సంబంధాలు చెడిపోయే ప్రమాదముంది.


Also Read: రాబోయే 10 సంవత్సరాల పాటు ఈ రాశులపై శని దేవుడి చెడు దృష్టి

కన్యా రాశి:
కన్యా రాశి వారికి తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు తీవ్రమైన ఆరోగ్య సంబంధిత అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు. ధన ప్రవాహం తగ్గిన చోట వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక అస్థిరత కూడా చాలా వరకు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కష్టాలు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం రాదు. కార్యాలయంలో పనిభారం పెరగడం వల్ల అసంతృప్తులుగా మీరు మిగిలిపోతారు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఖర్చులు పెరగడం వల్ల లాభాలు తగ్గుతాయి.

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

×