EPAPER
Kirrak Couples Episode 1

Importance Of Hanging Pumpkin Front Of The House : గుమ్మడికాయ, కలబంద ఇంటి ముందు పెట్టేటప్పుడు ఆ పని చేయడం మరిచిపోవద్దు

Importance Of Hanging Pumpkin Front Of The House : గుమ్మడికాయ, కలబంద ఇంటి ముందు పెట్టేటప్పుడు ఆ పని చేయడం మరిచిపోవద్దు

Importance Of Hanging Pumpkin Front Of The House : సహజంగా కొత్తగా కట్టుకున్న ఇళ్ల ముందు , గృహ ప్రవేశ సందర్భంలో మంచి గుమ్మడి మధ్యలో రంధ్రం చేసి ఎర్రనీళ్లు పోసి దానిపై కర్ఫూరం ఉంచి సింహద్వారానికి మూడు సార్లు చూపించి లోపలికి ప్రవేశించే దంపతులు నేలకేసి కొడతారు. అలా చేసినప్పుడు దిష్టి దోషం తొలగించబడుతుందని శాస్త్రం చెబుతోంది. బూడిద గుమ్మడి కాయ కూష్మాండ తత్వానికి నిదర్శనం. శ్రీమన్నారాయణుడికి దానం చేసి సత్ఫలితం కూడా వస్తుంది. అందుకే సంక్రాంతి పండుగ అప్పుడు పితృదేవతలను తలుచుకుంటూ బూడిద గుమ్మడి కాయ దానం చేసినట్లయితే విశ్వాన్ని దానం చేసిన ఫలితం వస్తుందట. ఇంత గొప్ప విశేషం బూడిద గుమ్మడి కాయలో ఉంది. గృహ ప్రవేశ సమయంలో సత్యనారాయణ స్వామి వత్రం చేసిన తర్వాత బూడిద గుమ్మడి కాయకు పసుపు, కుంకుమ రాసి ఇంటి యజమాని ఊట్టిలో పెట్టి ఇంటి ముందు వేళాడదీయాలి. నరఘోష దిష్టికి నల్లరాళ్లు కూడా పగులుతాయని అంటారు. నరఘోష ఇంటిపై పడకుండా, దుష్టశక్తుల ప్రభావం ఉండకుండా ఆ ఇంటి లోపలకి ప్రవేశించకుండా బూడిద గుమ్మడి కాయ కట్టే సంప్రదాయం మనకు పూర్వకాలం నుంచి వస్తోంది. గుమ్మడి కాయతో పట్టే వడియాలు తినడం వల్ల మనకు పట్టే నరఘోష కూడా బయటకిపోతుంది. మనకు తెలియకుండా కలిగే నరదృష్టి మన తిండే ద్వారా ఆ రకంగా శరీరం నుంచి వెళ్లిపోతుంది. అలాగే సరిగా తిండి తినక సన్నగా ఉండే పిల్లలు గుమ్మడి కాయతో దిష్టి తీసి ఆ కాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో ఉంచితే పిల్లల్లో మార్పులు గమనించవచ్చు. అలా చేయడం వల్ల దోష ప్రభావాలు తొలగిపోతాయి. బూడిద గుమ్మడికాయకు, మంచి గుమ్మడికాయకు శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది.


Tags

Related News

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 7 వస్తువులను పొరపాటున కూడా కింద పడేయకూడదు

Mahalaya 2024 Date: మహాలయ అమావాస్య ఎప్పుడు ? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

October 2024 Masik Rashifal : అక్టోబర్ నెలలో మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల జాతకం ఇదే

Importance of Tangedu flowers: ఈ పూలు లేనిదే దసరా లేదుగా.. అనుబంధాలను చాటి చెప్పిన పూల హిస్టరీ ఇదే

Personality by Zodiac Signs : ఈ రాశుల వారు చేసే ప్రతీ పనిలో అడ్డంకులే.. చివరకు గుణపాఠం నేర్చుకోవాల్సిందే

Rivers and Coins: నదుల్లో నాణేలు విసరడం వెనుక కారణమేమిటి? నదులను దైవంగా ఎందుకు పూజిస్తారు?

Big Stories

×