Big Stories

House Shifting : అద్దె ఇల్లు మారాల్సి వస్తే ..

- Advertisement -

House Shifting : కాలం మారినా సంప్రదాయాలు కాలగర్భంలోకి జారిపోతున్నా కొన్నింటిని మనం మర్చిపోకూడదు. మనం ఉండేది ఏదైనా సరే అద్దె ఇల్లు అయినా, సొంత ఇల్లు అయినా అది నివాస గృహం అవుతుంది. దేవాలయంలో దేవుడ్ని ఏర్పాటు చేసుకోవడం అది దేవుడికి నివాస స్థానంగా భావిస్తాం. అందుకేదేవాలయం అంటారు. ఆర్ధిక సమస్యల వల్ల చాలామంది సొంతిల్లు కట్టుకోలేరు. ఆశ ఉన్నా పైసలు లేక ఆగిపోతుంటారు. ఇంకొంతమంది స్థోమత ఉన్నా అద్దె ఇంట్లో ఉండటానికే ఇష్టపడుతుంటారు. అవసరాలు, సందర్భ్ఘాలు, అవకాశాలు బట్టి అద్దె ఇల్లులు మారాల్సి వస్తుంది. పిల్లల స్కూల్లు కోసమో, ఆఫీసుకి దగ్గరగా ఉండటం కోసం ఇల్లు మారుతుంటారు.

- Advertisement -

హడావుడిగా ఇల్లు మారడం , ఒత్తిడి తట్టుకోలేక ఖాళీ చేయడం, తొందరపాటులో ఉన్నపళ్లంగా ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి షిప్ట్ అవుతూ ఉంటారు కొందరు. అలాంటి సందర్భాల్లో మరో ఇంటికి వెళ్లినా మనసు పీకుతూ ఉంటుంది. సందేహాలు వేధిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొత్త ఇల్లు కూడా మనసుకి కష్టం కలిగించేలా ఉండే సందర్భాలు ఉంటాయి. సమస్యల్ని రెట్టింపు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆషాడం, శ్రావణం, బాధ్రపదం, ఇలా ఏమాసమైనా ఏజాతకులు అయినా మారడానికి కొన్ని తిథులు అందరికి శుభయోగంగా ఉంటాయి. పాడ్యమి ,విధియ, తదియ, పంచమి, సప్తమి , దశమి, ఏకాదశి, ద్వాదశి, యోగ్యమైనవి.

వారాల విషయానికి వస్తే బుధవారం, గురువారం,
శుక్రవారాలు అద్దె ఇల్లు మారడానికి శ్రేష్టమైన వారాలు. ఈ రోజుల్లో ఇల్లు మారితే కొత్త ఇల్లు అనుకూలంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే శనివారం, ఆదివారంల్లో ఇల్లు మారాల్సి ఉంటుంది పండితులు సూచిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో సోమవారం, మంగళవారం రోజుల్లో అద్దె ఇల్లు మారడం ఉత్తమం కాదని చెబుతున్నారు. బుధవారం, గురువారం, శుక్రవారం ఏ మాసంలో అయినా మారడానికి అనుకూలంగా ఉండే సమయాలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News