Big Stories

Varanasi temple : వారణాసి వెళ్తే 9 రోజులే అక్కడ ఎందుకు ఉండాలి

- Advertisement -

Varanasi temple : తల్లికడుపులో బిడ్డ ఉండే సమయం 9 మాసాల 9 రోజులు. అప్పుడప్పుడు కొంతమంది ఏడో నెలలో జన్మిస్తుంటారు. అది వేరే విషయం. కాశీలో ఒక్కో మాసం ఒక్కో రాతి కింద లెక్క. కాశీలో ఒక రాత్రి నిద్రించామంటే తల్లి కడుపులో ఒక నెల తగ్గుతుంది. అలా 9 రోజులు ఉంటే జన్మను కోల్పోతాం. అదే పునర్జన్మ ఉండదని అర్ధం. తల్లి గర్భంలో పుడితేనే భూమ్మి మీద జన్మించగలం. సుఖం, దుఃఖం నుంచి విముక్తి కలిగే ప్రాంతం ఈశ్వర సామ్రాజ్యం వారణాసి.

- Advertisement -

అందుకే కాశీకి వెళ్తే 9 రోజులు నిద్ర చేయగలిగితే చాలాని హిందువులు భావిస్తుంటారు. కాశీలో 9 ఉండడానికి వెళ్లేవారు ఆ 9 రోజుల్లో ఏం చేయాలో తెలుసుకుని వెళ్లాలి. మొదటి రోజు ముక్కోటి మణికర్ణికలో స్నానం చేసి కేశ ఖండనం చేయించుకోవాలి. తర్వాత తిరిగి స్నానం చేసి వినాయకుడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఆ పిదప అన్నపూర్ణా దేవిని దర్శించుకుని పూజించాలి. తరువాత కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శించాలి. మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం లేదా రాత్రికి కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి.
మరుసటి రోజు గంగా నదీ స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణమ్మను మాత్రమే దర్శించుకోవాలి. మధ్నాహ్నం మణి కర్ణికా ఘట్టంలో స్నానం తర్వాత గాయత్రి జపంచేయాల్సి ఉంటుంది. రాత్రి మరోసారి కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి.

మూడవ రోజు ఉదయాన్నే సంగమేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో నదీ స్నానం ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకోవాలి. ఆ తరువాత దశాశ్వ మేథ ఘాట్‌కు చేరుకుని శీతలా దేవిని దర్శినం చేసుకోవాలి. ఇలా మిగిలిన వారం రోజులూ వివిధ ఘాట్లలో స్నానం ఆచరిస్తూ దేవతలను దర్శించుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ మాత్రం కాశీ విశ్వనాథుడిని, అన్నపూర్ణాదేవిని దర్శించుకోవాలి. వీలును బట్టి కాశీ ఆలయంలో జరిగే వివిధ సేవల్లో పాల్గొనాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News