EPAPER

Dasara 2024: దసరా పండుగ ఎప్పుడు? 12 వ తేదీ లేదా 13వ తేదీ ? ఆయుధ పూజ, రావణ దహనం పాటించాల్సిన నియమాలు

Dasara 2024: దసరా పండుగ ఎప్పుడు? 12 వ తేదీ లేదా 13వ తేదీ ? ఆయుధ పూజ, రావణ దహనం పాటించాల్సిన నియమాలు

Dasara 2024: నవరాత్రులు పండుగ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దసరా పండుగ కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ ఏటా జరిగే దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజున మహిషాసురుడైన రాక్షసుడిని దుర్గామాత అంతమొందించి విజయం సాధించిందని గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాదు రాక్షసుడైన రావణుడిని రాముడు విజయం సాధించినట్లుగా కూడా చెబుతారు. అందువల్ల దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఆ ఏడాది దసరా వేడుకలపై చాలా మందిలో తీవ్ర సందిగ్థత నెలకొంది.


విజయదశమి ఎప్పుడు ?

ఈ ఏడాది దశమి తిథి రెండు రోజుల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 12 వ తేదీ లేదా 13 వ తేదీన రెండు రోజుల్లో దశమి తిథి ఉంటుంది. కాబట్టి ఆ రెండు రోజుల్లో దసరా ఎప్పుడు నిర్వహించుకోవాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ద్రిక్ పంచాంగం ప్రకారం అక్టోబర్ 12 వ తేదీన అంటే శనివారం విజయదశమి నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.


దసరా శుభ ముహూర్తం

విజయ ముహూర్తం – మధ్యాహ్నం 2:03 నుండి 2:49 వరకు ఉంటుంది
అపరాహణ పూజ సమయం – మధ్యాహ్నం 1:17 నుండి 3:35 గంటల వరకు ఉంటుంది
దశమి తిథి ప్రారంభం – అక్టోబర్ 12న ఉదయం 10:58 గంటలకు ఉండనుంది
దశమి తిథి ముగింపు – అక్టోబర్ 13న ఉదయం 9:09 గంటలకు ఉండనుంది

దసరా పండుగ ప్రాముఖ్యత రావణ రాక్షసునిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా, దుర్గా దేవి మహిషాసురుడిపై విజయం సాధించిన సందర్భంగా నిర్వహించుకుంటారు.

దసరా ఉత్సవాలు

హిందూ సంస్కృతిలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కేవలం ఉత్సవాలు మాత్రమే కాదు ప్రజలు తమ ఇళ్లలోని వాహనాలకు కూడా పూజలు నిర్వహిస్తారు. జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం జమ్మిని సోదరులకు పంచిపెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు దుర్గాదేవిని కూడా పూజించి, అనంతరం రాత్రి వేళ రావణ దహనం, మహిషాసుర దహనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Dussehra 2024 Upay: దసరా రోజున ఈ 5 అద్భుత పరిహారాలు పాటిస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి !

Dussehra 2024 Horoscope: దసరా నాడు శుభ యాదృచ్చికలు.. ఈ 3 రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు

Vastu Tips: దీపావళి లోపు ఇంట్లో ఈ 5 వస్తువులు తీసేస్తే దరిద్రం పోయి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది !

Saturn Dev Lucky Zodiacs: రాశిని మార్చబోతున్న శని.. ఈ రాశుల వారి జీవితంలో ఆనందం, డబ్బు ఉండబోతుంది

Shukra Gochar 2024: 3 రోజుల తర్వాత రాశిని మార్చబోతున్న శుక్రుడు.. మేష రాశితో సహా ఈ 3 రాశుల వారికి అడుగడుగునా సమస్యలే

Sun Transit 2024 Horoscope: 7 రోజుల తర్వాత తులా రాశిలోకి సూర్యుడు.. కన్యా రాశితో సహా 5 రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు

Big Stories

×