EPAPER

Venus Mahadasha: మీ జాతకంలో శుక్రుడి ప్రభావం ఉందా.. అయితే మీకు ఇక తిరుగే లేదు.. 20 సంవత్సరాల పాటు లగ్జరీ లైఫ్

Venus Mahadasha:  మీ జాతకంలో శుక్రుడి ప్రభావం ఉందా.. అయితే మీకు ఇక తిరుగే లేదు.. 20 సంవత్సరాల పాటు లగ్జరీ లైఫ్

Venus Mahadasha: ప్రతీ ఒక్కరు జీవితంలో సంతోషంగా ఉండాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆశపడుతుంటారు. అయితే అది అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ వ్యక్తి సంతోషంగా ఉండాలంటే అది గ్రహాల సంచారంపై ఆధారపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రహాలు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహాలు ఉండే స్థానాలను బట్టి వ్యక్తి ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం వంటి వాటిని నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరి జాతకంలో అయితే శుక్రుడు ఉంటాడో వారు విలాసవంతమైన జీవితం గడిపే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషం, శ్రేయస్సును పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకునే సూచనలు ఎక్కువగా ఉంటాయట. అయితే ఎవరి జాతకంలో అయితే శుక్రుని మహాదశ వస్తుందో వారు రాజులా జీవించే అవకాశాలు ఉంటాయి. ఇది దాదాపు 20 సంవత్సరాల పాటు ఉండబోతుంది. అయితే శుక్ర మహాదశ దక్కాలంటే వాటికి చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.


శుక్ర మహాదశ ప్రభావం

ఎవరి జాతకంలో అయితే శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడో వారికి మహాదశ ప్రారంభమైన వెంటనే ధనవంతులు అవుతారు. ఒకవేళ ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారికి శుక్ర మహాదశ ఉండదు. ఎటువంటి శుభఫలితాలు ఉండవు. అంతేకాదు 20 సంవత్సరాల పాటు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ నిరుపేద జీవితాన్ని గడపాల్సి వస్తుంది. వివాహంలో కూడా సమస్యలు ఎదురవుతాయి. జీవితం కష్టాలు, పేదరికంలో గడిచిపోతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం అటువంటి పరిస్థితిలో కొన్ని చర్యలు పాటిస్తే వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.


శుక్ర మహాదశ పరిహారాలు

శుక్రగ్రహ దోషం లేదా శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల శుక్ర మహాదశలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. శుక్రుని మహాదశ చాలా కాలం అంటే 20 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ నివారణలు పాటించాలి.

-ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలి. అలాగే లక్ష్మీ దేవిని పూజించాలి. నైవేద్యంగా ఖీర్ సమర్పించాలి. అనంతరం అమ్మాయిలకు ఖీర్ ప్రసాదం పంచి పెట్టాలి.

-ప్రతి శుక్రవారం చీమలకు పిండి, పంచదార పెట్టాలి. ఈ పరిహారం శుక్రుడిని బలపరుస్తుంది.

-శుక్రవారం నాడు ‘శున్ శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.

-శుక్రవారం నాడు పాలు, కర్పూరం, తెల్లని వస్త్రాలు, తెల్లని మిఠాయిలు, అన్నం, ముత్యాలు, తెల్లటి వస్తువులను దానం చేయండి.

Related News

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Big Stories

×