EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది.? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:  
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో సంతృప్తికర ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

వృషభం: 
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరంగా వృద్ధి సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.


మిథునం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సమస్యలు ఎదురైనా అధైర్యపడొద్దు.ఉద్యోగంలో శారీరక శ్రమ, ఒత్తిడి పెరగవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పట్టువదలకుండా విజయం పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త పనులు మొదలు పెడతారు. అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. వ్యాపారస్తులకు శుభ సమయం. హనుమాన్ చాలీసా పఠించడంతో మంచి ఫలితాలు.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ కాలం. సమయాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో పదిరెట్లు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు స్వల్ప ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆంజనేయస్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య:
కన్య రాశి వారికి ఆనందకరంగా ఉంటుంది. మీ రంగాల్లో లక్ష్యాలకు అనుగుణంగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక లాభం వరిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో పరిష్కరించుకోవాలి. ఇతరుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. సూర్య స్తుతి మేలు చేస్తుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక వృద్ది ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ధన లాభం ఉంది. ప్రయాణాాలు అనుకూలిస్తాయి. ఇతరులతో సరదాగా గడుపుతారు. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. గణపతి ఆలయ సందర్భన శుభకరం.

మకరం:
ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక లాభాలు పొందుతారు. ఈ రంగాల్లో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సహనంతో పనులు పూర్తి చేయాలి. అనవసర విషయాల జోలికి పోకూడదు. ఖర్చులు అధిగమయ్యే అవకాశం ఉంది. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

మీనం:
మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.

Related News

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు ? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే..

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Big Stories

×