EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం గ్యారంటీ!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం గ్యారంటీ!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఎవరికి అనుకూలంగా ఉంది. ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడికి లోను కావొద్దు. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఇష్టదూవారాధన శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రారంభించిన పనుల్లో విజయం పొందుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థాన చలనం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. శివారాధన శ్రేయస్కరం.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల వారు కొత్త పనులు మొదలు పెట్టడం మంచిది కాదు. పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చికిత్స నిమిత్తం అధిక ఖర్చులు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి అసంతృప్తిగా ఉంటారు. గణపతి స్తోత్రం చదవాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టే ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు లేకుండా చూసుకోవాలి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు అధిక లాభాలు వరిస్తాయి. తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో పెద్దల సలహాలు అవసరం. స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దుర్గాదేవి ఆరాధన శుభకరం.

తుల:
తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. స్థిర నిర్ణయాలతో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి లాభం చేకూరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసర విషయాలకు వెళ్లకపోవడం మంచిది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులు, స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలపై ఎక్కువగా సమయాన్ని వృథా చేస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శివారాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కీలక పనుల్లో శ్రమ, ఒత్తిడికి గురవుతారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసులు ఉంటాయి. నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. నవగ్రహ శ్లోకం పఠిస్తే మేలు జరుగుతుంది.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడికి గురవుతారు. కీలక సమయాల్లో బుద్ధిబలంతో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా లాభం పొందుతారు. దైవబలం అండగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా విజయం సాధిస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారిని ఆరాధిస్తే మంచిది.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఒత్తిడితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. సమయానికి నిద్ర ఉండదు. కొంతమంది ఇబ్బందులకు గురిచేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. లలితా సహస్రనామ పారయణ శుభప్రదం.

Related News

Navratri 2024: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

Pitru Paksha 2024: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.

Trigrahi yog September 2024 Rashifal: ఒక్క వారంలో ఈ 6 రాశుల జీవితాలు మారబోతున్నాయి..

Auspicious Dream: కలలో ఈ పువ్వు కనపిస్తే ధనవంతులు అవవుతారట.. మీకు కనిపించిందా మరి

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Big Stories

×