EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏరాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి? ఇబ్బందులు తొలగాలంటే ఎలాంటి పనులు చేయాలనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఈ రాశి వారిని లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి. అందరి మన్ననలు పొందుతారు. హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో వ్యవహరించి విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గారాధన శుభప్రదం.


మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోపం దరిచేరనీయవద్దు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ స్తోత్రం పఠిస్తే ఆపదలు తొలగుతాయి.

కర్కాటకం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంది. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ది ఉంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఆదాయం వృద్ది చెందుతుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సూర్య ఆరాధన మంచిది.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పనులు నెమ్మదిగా సాగుతాయి. కీలక సమయాల్లో మనోధైర్యం కోల్పోవద్దు. ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకవపోవచ్చు. ఉద్యోగాల్లో స్థానచలనం ఉంటుంది. ఆర్థికంగా ఎదిగేందుకు ఆలస్యం కావొచ్చు. ఇతరుల సహకారంతో పనులు పూర్తవుతాయి. హనుమ ఆరాధనతో మంచి ఫలితాలు వస్తాయి.

కన్య:
కన్య రాశి వారికి శుభప్రదం. చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో సంతోషంగా ఉంటారు. ఇష్ట దేవతారాధన మంచిది.

తుల:
తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తే విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ఆలోచనలు తోటి వారితో పంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలు, అనారోగ్యంతో అశాంతి ఉండవచ్చు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి శుభసమయం. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతి పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ దర్శనం ఉత్తమం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాల వారికి పని భారం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దల సలహాలతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరంగా మంచి లాభాలు పొందుతారు. అవివాహితులు జీవిత భాగస్వామిని కలుస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు ఉంటాయి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి ఆదాయం పొందుతారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రంగాల్లో ఉత్సాహంగా తగ్గకుండా చూసుకోవాలి. గిట్టనివారు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. మోసపూరిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉండవచ్చు. దుర్గారాధన శుభప్రదం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని లాభాలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ముందడుగు వేస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

Related News

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Big Stories

×