EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి ఆర్థిక పరంగా లాభం చేకూరుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కీలక సమయాల్లో తీసుకునే నిర్ణయాలు ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆదాయం రెట్టింపు అవుతుంది. కోపాన్ని తగ్గించుకుంటే మంచి జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పర్వాలేదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. గోసేవ మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సరైన ఆలోచనలతో అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నూతన పనులు మొదలుపెడతారు.  వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొండి బాకీలు వసూలవుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధించాలి.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో పట్టువదలకుండా అనుకున్నది సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో లాభాలు పొందుతారు. అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రుల సహకారం ఫలిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడంతో మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు చదువుతోపాటు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్మీదేవిని సందర్శించాలి.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వ్యక్తిగత సమస్యలు దూరమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

కన్య:
కన్య రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. వ్యాపారాల్లో రాబడికి ఆశించినంతగా పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదాయానికి లోటు ఉండదు. మిత్రుల నుంచి డబ్బు విషయంలో ఒత్తిడి ఉంటుంది. మీ పనితీరు ఆకట్టుకుంటుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవము చదివితే మంచిది.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఫలితాలను రాబట్టేందుకు సరైన సమయం. ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సౌభాగ్య సిద్ధి ఉంది. అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని పూజించాలి.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. శని ధ్యానం చేయడంతో మంచి ఫలితాలు పొందుతారు.

ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేయాలి. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబంతోపాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వేంకటేశ్వరస్వామి వారిని సందర్శించాలి.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మానసిక ప్రశాంతత అవసరం. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. సమయానికి నిద్రపోవాలి. వ్యాపారాల్లో విశ్రాంతి లభించదు. శ్రీ విష్ణు ఆరాధన మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితంలో సమస్యలు ఉండవు. ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారాల్లో పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అవసరానికి తగిన సహాయం పొందుతారు. ఆంజనేయ స్తోత్రము పారాయణ చేస్తే మంచిది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. ధనధాన్య లాభాలుంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల సహాయంతో కీలక పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. హనుమత్ ఆరాధన శుభప్రదం.

Related News

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

×