Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఫలితం ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి కీలక వ్యవహారాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించనున్న పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఒత్తిడి, ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శివనామం శుభప్రదం.
వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉత్సాహంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభం పొందుతారు. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
మిథునం:
మిథునం రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో వివాదాలు పెట్టుకోవద్దు. సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చు అధికంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తిని ఇస్తుంది.
కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఊహించని లాభాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.
సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తిరుగులేని విజయం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసులు అందుకుంటారు. పెద్దల సలహాలు పనిచేస్తాయి. దుర్గాధ్యానం శుభప్రదం.
కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కుటంబంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విదేశీ ప్రయాణం ఉండే అవకాశం ఉంటుంది. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
తుల:
తుల రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని పనులను వాయిదా వేయడం మంచిది. సమస్యలు ఎదురుకొవొచ్చు. ఇతరులతో ఆచితూచి మాట్లాడాలి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సూర్య ఆరాధన శుభకరం.
ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. వ్యాపార విషయాలపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొని నిలబడతారు. ఉద్యోగులకు ఊహించని ప్రయోజనాలు ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.
మకరం:
మకరరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టమైన దేవతారాధన శుభప్రదం.
కుంభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ప్రారంభించిన పనుల్లో పట్టుదలతో విజయం సాధిస్తారు. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు ఊహించని ధనప్రవాహం ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానంతో మనోబలం పెరుగుతుంది.
మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. కీలక సమయంలో డబ్బు చేతికి అందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.