EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

Astrology Today: పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.? ఎవరికి ధనలాభం కలిసి వస్తుంది.? ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? వంటి వివరాలను జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి,వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. నిరుద్యోగులతోపాటు ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది. వృత్తి,వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. తోటివారి సూచనలు ఫలిస్తాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఖర్చులపై జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.


మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నతాధికారుల సహాయ సహకారులు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాదేవి దర్శనం శుభకరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో కొంత పనిభారం, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకు వాగ్దానాలు చేయకూడదు. పని విషయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వ్యాపారస్తులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య:
కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. బంధువుల సహకారం ఉంటుంది. ఆకస్మిక ధన లాభం వరించవచ్చు. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

తుల:
తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. పెట్టిన పెట్టుబడులకు పదింతలు లాభాలు వస్తాయి. కీలక పనులు సునాయసంగా పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. గణపతి ఆలయాన్ని సందర్శిస్తే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మాటలు, కోపం రాకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. బంధుమిత్రులతో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసర విషయాలపై ఆలోచన చేయవద్దు. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు:
ఈ రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక లాభం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

మకరం:
మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనో బలంతో ముందుకు సాగాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శని స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వరిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×