Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాలపై జ్యోతిష్యులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన కీలక పనుల్లో ఆటంకాలు ఎదురైనా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో స్వల్ప నష్టాలు కలుగవచ్చు. ఇతరులతో చర్చలు, వాదనలు ఏర్పడవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శారీరక శ్రమ, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారంతో అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
మిథునం:
మిథున రాశి వారికి ఆశాజనకంగా లేదు. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అన్ని రంగాల వారికి సమస్యలు ఎదురుపడవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్తలు పాటించాలి. వృథా ఖర్చులు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన కీలక వ్యవహారాల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించి సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతారాధన శుభప్రదం.
సింహం:
సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో దృఢమైన మనస్సుతో ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్లో చిరాకు కలగవచ్చు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య:
ఈ రాశి వారికి ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దల సలహాలు ఫలిస్తాయి. ఇతరుల ప్రవర్తన ఇబ్బంది కలగవచ్చు. సమయాన్ని వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆశించిన లాభాలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తోటివారి సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాల ద్వారా మంచి లాభాలు ఉంటాయి. ప్రయాణాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణతో శుభ ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. విదేశీ యానం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. స్నేహితులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉద్యోగులు తోటివారి సహకారంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మంచిది.
ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆలస్యం కావొచ్చు. శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. అన్ని రంగాల వారికి సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు మంచి ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారంలో నిరాశ ఎదురవుతుంది. అందరినీ కలుపుకొని పనిచేస్తే ఫలితాలు రావొచ్చు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అభివృద్దికి సంబంధించిన వార్త వస్తుంది. బంధుమిత్రులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివపార్వతుల ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
Also Read: భద్ర రాజయోగం.. వీరి వ్యాపారంలో పురోగతి
కుంభం:
కుంభ రాశి వారిక అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ ప్రవర్తన, మాటలతో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సంపాదన పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.
మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో చేపట్టి పనుల్లో స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పని విజయవంతం అవుతుంది. ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.