EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి లాభాలే లాభాలు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి లాభాలే లాభాలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలాంటి పనులు చేస్తే సమస్యలు తీరుతాయి వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. అవసరమున్న సమయంలో సహాయం పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వరిస్తాయి. శత్రువులకు దూరంగా ఉండాలి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించాలి.

వృషభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు తిరుగులేని విజయం సాధిస్తారు.కీలక సమయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంభ సభ్యుల సహకారం ఉంటుంది. బకాయిలు అందుతాయి. శివారాధన శ్రేయస్కరం.


మిథునం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన ప్రాజెక్టులు పెట్టేందుకు అనుకూల సమయం. కీలక విషయాల్లో బుద్ధి బలం పనిచేస్తుంది. ప్రారంభించిన పనుల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మంచిది.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ముఖ్య వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి.

కన్య:
కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో తిరుగులేని విజయాలు అందుకుంటారు. ఇతరులను కలుపుకొని వెళ్లడంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. గణపతి ఆలయ సందర్శన మంచిది.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, పెద్దల సహకారం ఫలిస్తుంది. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. వ్యాపారాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఇష్టదైవారాధన శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి మంచి ఫలితాలున్నాయి. అన్ని రంగాలు వారు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. మీ ప్రయత్నాల్లో దైవ బలం సహకరిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ కాలం. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సవాళ్లను ఎదుర్కొంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. సూర్య ఆరాధన మంచిది.

మకరం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. దైవారాధన మానవద్దు.

కుంభం:
కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇతరుల సహకారం తీసుకొని అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాల్లో తిరుగులేని విజయం సాధిస్తారు. అన్ని రంగాల్లో అధికంగా లాభాలు పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కీలక నిర్ణయాలతో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సలహాలు తీసుకుంటారు. శివ నామస్మరణ మంచిది.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారులకు ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×