EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెండింగ్ సమస్యలకు పరిష్కారం ఉంటుంది.దుర్గాస్తుతితో ఉత్తమ ఫలితాలు.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ప్రారంభించిన పనుల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారుకుల లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం క్షీణిస్తుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.


మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో కీలక విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. పెద్దల సలహాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. గోసేవ చేయడం మంచిది.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు నెరవేరుతాయి. అభివృద్ధిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. ఊహించని ధనలాభాలు ఉంటాయి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సమస్యలకు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టించవచ్చు. దుర్గాదేవి ఆరాధన శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగులు తోటివారి సహకారంతో కీలక పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కార్యాలయాల్లో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి.పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వ్యాపారులు ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. దైవారాధన మానవద్దు.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో చేపట్టి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఇబ్బందులు, ఒత్తిడి ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు ఎదురుకావడంతో కోపం, చిరాకు పెరిగే అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. తక్కువ మాట్లాడడం మంచిది. ఆరోగ్యం సహరిస్తుంది. విష్ణు నామస్మరణ శుభప్రదం.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్న పనులు సాధిస్తారు. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టు పనులు మొదలుపెడతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గురు శ్లోకాలు పఠిస్తే మంచిది.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×