EPAPER

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Astrology 8 September 2024: జ్యోతష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. వ్యాపారులకు పండగే. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఊహించని విధంగా సంపద కలుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో సత్పలితాలు పొందుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గణపతి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. చేపట్టిన పనుల్లో మనోబలంతో చేస్తే విజయం పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో పని ఒత్తిడి పెరగవచ్చు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. వ్యాపారంలో నష్టాలు రావొచ్చు. ఉద్యోగులకు ఆటంకాలు ఎదురవుతాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మేలు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్పలితాలు సిద్ధిస్తాయి.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఇబ్బందులు ఎదురైనా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారు మంచి ఫలితాలు అందుకుంటారు. ఏ పని మొదలు పట్టినా పూర్తిచేస్తారు. వ్యాపారులకు రెట్టింపు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, బదిలీలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో బంధువుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభవార్త వింటారు. ఆర్థిక వ్యవహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఇష్టదేవతారాధన శ్రేయస్కరం.

Also Read:  అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. గొప్ప అవకాశాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఉన్నతాధికారులు నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం:
వృశ్చికం రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు, సవాళ్లు ఎదురుకొవొచ్చు. చేపట్టిన పనుల్లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. కీలక నిర్ణయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పట్టుదలతో పనిచేస్తే గొప్ప లాభాలుంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శివారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన పురోగతి ఉండకపోవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపం, చిరాకు విషయంలో దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. శనిస్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. కార్యసిద్ది ఉంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటాయి. శత్రువులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభకరం.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఊహించని లాభాలు వరిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఇతరుల విషయాల్లో దూరవద్దు. నమ్మిన వారే ఇబ్బందికి గురిచేయవచ్చు. వివాదాలు దూరంగా ఉండడం మంచిది. కోపాన్ని తగ్గించుకోవాలి. గోసేవ చేస్తే మంచిది.

Related News

Navratri 2024: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

Pitru Paksha 2024: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.

Trigrahi yog September 2024 Rashifal: ఒక్క వారంలో ఈ 6 రాశుల జీవితాలు మారబోతున్నాయి..

Auspicious Dream: కలలో ఈ పువ్వు కనపిస్తే ధనవంతులు అవవుతారట.. మీకు కనిపించిందా మరి

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Big Stories

×