EPAPER

Horoscope 8 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. దైవారాధన మానవద్దు!

Horoscope 8 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. దైవారాధన మానవద్దు!

Astrology 8 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. దైవారాధన మానవద్దు.


మిథునం:
మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం పొందుతారు. ఉద్యోగులు తోటివారి సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదనపు ఆదాయం ఉంటుంది. ప్రయాణాుల వాయిదా వేసుకోవాలి. శివాలయ సందర్శనం మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. కీలక వ్యవహారాల్లో కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ కలహాలపై జాగ్రత్తలు అవసరం. ఇతరులతో వాదనలకు వెళ్లకుపోవడం మంచిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. విష్ణు నామస్మరణ ఉత్తమం.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేదు. తద్వారా చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయంపై అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. సూర్య ఆరాధన మంచిది.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారులకు ఆదాయం రెట్టింపు అవుతుంది. పెద్దల నిర్ణయాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా పారాయణతో సమస్యలు తొలగిపోతాయి.

Also Read: మహాషష్టి పూజ ఎప్పుడు ? తేదీ, పూజకు సంబంధించిన వివరాలు ఇవే

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. చేసే ప్రతి పనిలోనూ విజయాలు వరిస్తాయి. అన్ని రంగాల వారికి ఆశాజనకంగా లాభాలు ఉంటాయి. ఇతరులను అతిగా నమ్మి మోసపోవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే ఆపదలు తొలగిపోతాయి.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుతారు. బంధుమిత్రుల సహకారంతో విజయాలు పొందుతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్టదేవతారాధన శుభకరం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు ఆర్థిక పురోగతి ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కార్య సిద్ధి ఉంది. బంధుమిత్రుల సహకారంతో సందడి నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కుంభం:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉంటాయి. లలితా సహస్రనామ పారాయణ మంచిది.

మీనం:
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక లాభాలు వరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు శారీరక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. అనుకోని ఆపదలు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

Related News

Durga Puja 2024: మహాషష్టి పూజ ఎప్పుడు ? తేదీ, పూజకు సంబంధించిన వివరాలు ఇవే

Astrology tips on Dussehra: దసరా నాడు ఈ పనులు చేస్తే త్వరలో మీరు కూడా ‘అదానీ-అంబానీ’లు కావచ్చు

Maha Ashtami 2024: మహా అష్టమి నాడు ‘మహా సంయోగం’.. 3 రాశులకు ఆర్థిక లాభాలు

Surya Gochar: అక్టోబర్ 17న తులా రాశిలోకి సూర్యుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం వరిస్తుంది

Laxmi Narayan Yog Horoscope: మరో మూడు రోజుల్లో లక్ష్మీ నారాయణ యోగం కారణంగా 4 రాశులు వారికి బంగారు సమయం రానుంది

Papankusha Ekadashi: పాపాంకుశ ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి చెట్టుకు నీరు పోయకండి

×