EPAPER

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Astrology 7 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసొచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.

వృషభం:
వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఖర్చుల విషయంలో అదుపులో పెట్టుకోవాలి. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు చేకూరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తుల అమ్మకాల ద్వారా ధనం చేతికి అందుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి, శారీరక శ్రమ ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. గణపతి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. ప్రారంభించిన పనుల్లో సమస్యలు ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులను దైవబలంతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. డబ్బు అందినట్లే అంది చేజారిపోతుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు మన:శ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ఆత్మబలంతో పనిచేస్తే ఆటంకాలు దరిచేరవు. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. పెద్దల సలహాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారంతో పూర్తిచేస్తారు. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. వ్యాపారంలో పోటీ ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.

Also Read: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

తుల:
ఈ రాశి వారికి అనుకూలం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉడ్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు ఉంటాయి. వినాయకుడిని పూజించడం శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రతికూలతలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రులో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ్రీ దుర్గాదేవి ధ్యానంతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి,వ్యాపార, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అసంతృప్తి ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రతిభకు పురస్కారం దక్కుతుంది. ప్రమోషన్స్ ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రీ ఆంజనేయ దర్శనం శుభకరం.

కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో పనులు నెమ్మదిగా సాగుతాయి. ఓపికతో ఉంటే పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆదాయం అంతంతమాత్రమే ఉంటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. శివారాధర శ్రేయస్కరం.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలకమైన పనులు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. గిట్టనివారితో ఆచితూచి వ్యవహరించాలి. తప్పుదారి పట్టించవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వృద్ది చెందుతుంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

Related News

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Anant Chaturdashi 2024: అనంత చతుర్దశి నాడు ఇలా చేస్తే గణపతితో సహా శ్రీ హరి-లక్ష్మీ అనుగ్రహం పొందుతారు

Horoscope 16 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆ విషయంలో తొందరపడొద్దు!

Lucky Zodiac Signs: ఈ రాశుల వారు కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉంటారు

Weekly Horoscope (15-21): సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు వారఫలాలు

Venus-Ketu Conjunction: శుక్రుడు, కేతువుల సంచారం.. వీరు తస్మాత్ జాగ్రత్త

Big Stories

×