EPAPER

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Astrology 6 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఉన్నాయి? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఉంటాయి. నవగ్రహాలను ధ్యానించాలి.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల్లో వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. వాయిదా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో సమస్యలు ఏర్పడవచ్చు. బంధుమిత్రుల సలహాలతో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సూర్య భగవానుడిని ధ్యానించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన కీలక పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. కుటుంబ కలహాలు ఉండవచ్చు. వృథా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించాలి.

సింహం:
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. పెండింగ్ పనులు పరిష్కారమవుతాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని పూజించాలి.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

Also Read: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాదాల జోలికి వెళ్లవద్దు. సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి తగాదాల్లో పరిష్కారం దొరుకుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రీతిలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి లాభాలు అంతంత మాత్రమే ఉన్నాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారంలో ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. దేవీస్తోత్రాలు పఠించండి.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. అనారోగ్యం వేధిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం:
మీన రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల లాభాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. గిట్టనివారితో ఆచితూచి వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. ఆంజనేయ దండకం పఠించండి.

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

×