EPAPER

Horoscope 3 September 2024: ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు! ఈ పనులు వాయిదా వేస్తే మంచిది!

Horoscope 3 September 2024: ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు! ఈ పనులు వాయిదా వేస్తే మంచిది!

Astrology 3 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఫలవంతంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యం కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. పితృ సంబంధమైన ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. దైవారాధన మానవద్దు.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. అన్ని రంగాల వారు కొత్త పనులు చేపట్టేందుకు శుభకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందడంతోపాటు నూతన బాధ్యతలు తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. శ్రీ ఆంజనేయుడి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తి చేసేందుకు చిత్త శుద్ధి అవసరం. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగాల్లో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మాతృవర్గం నుంచి శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సాహసోపేతమైన విజయాలు ఉంటాయి. సమయాన్ని వృథా చేయకండి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

సింహం:
సింహ రాశి వారికి విశేషంగా యోగిస్తుంది. కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికాభివృద్దికి కోసం చేపట్టిన ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగులకు శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. విహారయాత్రలకు వెళ్తారు.ఆదాయం పెరుగుతుంది. శని శ్లోకాన్ని చదవండి.

కన్య:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న సమయంలో ఆదాయం వరిస్తుందతి. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది.పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, ఆదాయం వృద్ధి చెందుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి అదృష్ణదాయకంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం ఉంటుంది. అన్ని రంగాల వారు విజయం సాధిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అధిక లాభాలు ఉంటాయి. విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. చేసే పనుల్లో ఏకాగ్రత, చిత్తశుద్ధి లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాల్లో అనుకున్న పనులు సమయానికి చేస్తారు. తద్వారా ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఉంటుంది. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభకరం.

Also Read: శుక్రవారం లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే కష్టాలు తొలగిపోతాయ్

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కొత్త పనులు చేపట్టకపోవడం మంచిది. పట్టుదలతో కీలక పనులు పూర్తి చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలు తెచ్చి పెడతాయి. శ్రీ రామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మకరం:
మకరరాశి వారికి అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగానికి లోను కావొద్దు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. కీలకమైన వ్యవహారాలు ముందుకు సాగక ఇబ్బందులు పడుతారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా చదవాలి.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

మీనం:
మీనం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి, లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

Related News

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×