EPAPER
Kirrak Couples Episode 1

Horoscope 25 September 2024: ఈ రాశి వారికి పవర్‌ఫుల్ యోగం.. ప్రమోషన్స్ ఛాన్స్!

Horoscope 25 September 2024: ఈ రాశి వారికి పవర్‌ఫుల్ యోగం.. ప్రమోషన్స్ ఛాన్స్!

Horoscope 25 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది? ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందా? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం అవసరం. అవివాహితులకు విహహం నిశ్చయమవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఛాన్స్ ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు వరిస్తాయి. ముఖ్యమైన పనులను మనోబలంతో పూర్తిచేస్తారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామ నామాన్ని జపించాలి.


మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఆర్థికపరంగా ఆచితూచి వ్యవహరించాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. సమయాన్ని వృథా కాకుండా మెలగాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీగణపతిని ధ్యానించండి.

సింహం:
సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. కోపాన్ని, ఒత్తిడిని జయించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణం శక్తినిస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పని భారం, ఒత్తిడి ఉంటుంది. తోటివారి సహకారంతో విజయం వరిస్తుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందిత. ఓర్పు, సహనం అవసరం. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు కల్యాణ ఘడియలు ఉండవచ్చు. శివారాధన చేస్తే మరింత విజయం పొందుతారు.

Also Read: అరుణాచలం వెళ్తున్నారా? అయితే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్స్ ఛాన్స్ ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు వస్తాయి. కొన్ని విషయాల్లో పనిభారం ఉండడంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేస్తేనే మంచిది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శన శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కొత్తగా చేపట్టే వ్యాపార పనులు వేగంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ప్రమోషన్స్ ఛాన్స్ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శుభప్రదం.

కుంభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మీనం:
మీనరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించిన ఆటంకాలు ఎదురవుతాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గిట్టనివారితో ఆచితూచి నడుచుకోవాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. శ్రీలక్ష్మి గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

Related News

Negative Things: ఈ వస్తువులు రోడ్డుపై కనిపిస్తే ముట్టుకోకండి, వాటిని తాకితే ఏమవుతుందో తెలుసా?

Arunachalam food: అరుణాచలం వెళ్తున్నారా? అయితే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Lucky Zodiac Signs: 2 గ్రహాల ప్రభావం.. వీరికి ధనలాభం

Horoscope 24 September 2024: నేటి రాశి పలాలు.. ఊహించని ధనలాభం! అవివాహితులకు వివాహం నిశ్చయం!

Negative Energy Signs: ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. ఈ నివారణ చర్యలు పాటించండి

Shardiya Navratri 2024 : నవరాత్రులులోపు ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచకండి

Big Stories

×