EPAPER
Kirrak Couples Episode 1

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Astrology 22 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగుకులకు కలిసి వస్తుంది. ప్రమోషన్స్ ఉండవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. బాధ్యతలు నెరవేరుస్తారు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో పట్టుదలతో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఊహించని లాభాలు ఉంటాయి. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక పనులను ప్రణాళికతో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అందరి సహకారంతో కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. మిత్రుల సహకారంతో పనిభారం తగ్గుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కుటుంబంలో గొడవలు, వివాదాలకు అవకాశం ఉంది. కోపాన్ని, దూకుడును తగ్గించుకుంటే మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో అనుకూలం ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలకు ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. నిరాశకు లోనవుతారు. వివాదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతింటుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ స్తోత్ర పరాయణంతో శుభ ఫలితాలు ఉంటాయి.

Also Read: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

తుల:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుత్రువుల నుంచి ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. శని శ్లోకం చదవాలి.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఈశ్వర ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారంతో పనులు పూర్తిచేస్తారు. ఆదిత్య హృదయం చదవాలి.

కుంభం:
కుంభ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

మీనం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు రెట్టింపు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసరంగా ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలను చదివితే మంచిది.

Related News

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Big Stories

×