EPAPER

Horoscope 22 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అవివాహితులకు విహహయోగం!

Horoscope 22 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అవివాహితులకు విహహయోగం!

Astrology 22 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి  ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారంలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో తోటివారి సలహాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. దుర్గారాధన శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రుల సహకారంతో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులపై జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.


మిథునం:
మిథున రాశి వారికి శుభకరంగా ఉంటుంది. కీలక పనులు అనుకున్నట్లుగానే పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి ఆర్థికంగా శుభకరంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కావొచ్చు. కుటుం సభ్యులతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఖర్చులతోపాటు ఆదాయం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కర్కాటకం:
ఈ రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పెండింగ్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆకస్మిక ధనలాభాలు వంటి సత్పలితాలు ఉంటాయి. విహారయాత్రలకు వెళ్లనున్నారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శారీరక శ్రమ, ఒత్తిడితో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఎదురయ్యే సవాళ్లను సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారు. యోగా, ధ్యానం చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సమస్యలు ఎదురుకావొచ్చు. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉంటారు. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. భోజన సౌఖ్యం కలదు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తికావడంతో పేరు, ప్రఖ్యాతలు పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఉద్యోగులకు ఊహించని సమస్యలు ఎదురుకావడంతో ఆందోళనకు గురవుతారు. షేర్ మార్కెట్ల వంటి వాటిల్లో నష్టాలు ఎదురుకావొచ్చు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

ధనుస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఎదురయ్యే సమస్యలతో ఇబ్బందులు పడతారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది బంధువులు నుంచి ఇబ్బందులు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అభయ ఆంజనేయస్వామిని ఆరాధిస్తే ఆపదలు తొలగిపోతాయి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుందిత. అన్ని రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక అంశాలపై శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం శ్రద్ద అవసరం. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.

Also Read: మీ చేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే మీరు కోటీశ్వరులు అయినట్లే..

కుంభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మీనం:
మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఇతరుల నుంచి సహాయం అందుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మంచి సమయం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం మరింత వృద్ది చెందుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. దుర్గాస్తోత్రం చదవాలి.

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×