EPAPER

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Astrology 20 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయ. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి అదృష్టకరంగా ఉంటుంది. మీలోని శ్రద్ధాభక్తులు గొప్పవారిగా మారుస్తాయి. వృత్తి, వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. తొందరపడి ఎవరినీ నమ్మవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. భాగస్వామ్య వ్యాపారులు కలిసి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దైవబలం తోడుంటుంది. ముఖ్యమైన పనుల కోసం పెద్దల సలహాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారంతో విజయాలు సిద్ధిస్తాయి. పని ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గురుధ్యాన శ్లోకాలు పఠిస్తే ప్రశాంతత ఉంటుంది.

సింహం:
సింహ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో నిరాశ గురవుతాయి. ధన నష్టం ఉండవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులత సహకారంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. ఊహించని లాభాలు వరిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

Also Read: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సన్నిహితులతో కలిసి పర్యాటక ప్రదేశాల్లో పర్యటిస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు. ఉద్యోగులకు జీతం పెరుగుదల ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదైవ నామాన్ని జపించాలి.

వృశ్చికం:
ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి లాభాలు వస్తాయి. ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. సకాలంలో సహాయం చేసే వారు ఉంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శివారాధన శుభప్రదం.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ్రీ రామ నామాన్ని జపించడం మంచిది.

మకరం:
మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. బుద్దిబలం బాగుంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆదాయం రెట్టింపు అవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారంతో విజయం పొందుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఒత్తిడి, పని భారం పెరగవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థుల చదువుపై దృష్టి సారించాలి. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులను తొందరపడి నమ్మవద్దు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. కాస్త ఓపిక పట్టాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారులకు పట్టిందల్లా బంగారమే. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఖర్చులు అదుపులలో ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదైవ నామాన్ని జపించాలి.

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×